గుంటూరు జిల్లా వ్యాప్తంగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో ఒక గుంటూరు నగరంలోనే అధికంగా 15 కేసులు నమోదయ్యాయి.దీంతో గుంటూరు నగరాన్ని పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ నిర్ణయించారు.రేపు ఉదయం నుండి గుంటూరు పట్టణంలోకి ప్రవేశించడంతో పాటు బయటికి వెళ్లడాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
కోవిడ్-19 కేసులు నమోదైన ప్రాంతాలలో కంప్లీట్‌గా రాకపోకలు నిషేధిస్తున్నట్లు తెలిపారు.ఆ ఏరియాలోని ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు, కూరగాయలను మొబైల్ వాహనాల ద్వారా సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు. నిషేధాజ్ఞలను ఎవరైనా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.
కరోనాను అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఆయా ప్రాంతాలలోని ప్రజలు వేరే వ్యక్తులతో కలవద్దని,వేరే ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రాంతాల వారిని కలవద్దని కోరారు.కొందరు బారికేడ్లను తొలగించుకొని బయటకు వస్తున్నట్లు గమనించామని ఈ పద్దతి మానుకోవాలని ప్రజలకు హితవు చెప్పారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసమే సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నామని ప్రజలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎస్మా చట్టం ప్రకారము వైద్య సిబ్బంది ఎంత తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని గుంటూరు కలెక్టర్ ఆదేశించారు.రిటైర్డ్ ఉద్యోగులు కూడా కరోనా కట్టడిలో భాగస్వామి భాగస్వాములు కావాలని కోరారు.క్వారంటైన్ కేంద్రాలలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.