iDreamPost
iDreamPost
నిజంగానే విచిత్రంగా ఉంది మందుబాబుల పరిస్ధితి. మద్యానికి బానిసలైపోయిన వారి పరిస్ధితి చాలా భయంకంరంగా ఉంది. మద్యం దొరకకపోవటంతో తెలంగాణాలోనే సుమారు 7 మంది చనిపోయినట్లు ప్రచారంలో ఉంది. సుమారు 30 మందికి పైగా ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. మద్యానికి బానిసలైపోయిన వారికి కరోనా వైరస్ కారణంగా మందు దొరకటం లేదు. దాంతో ఆ ప్రభావం మానసిక పరిస్దితిపై పడింది.
ఇదే విషయాన్ని ఆల్కహాలిక్ బేవరీజెస్ కంపెనీల సమఖ్యా ( సిఐఏబిసి) ప్రస్తావిస్తు పది రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయటం సంచలనంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మందు బానిసలకు మద్యం దొరకకపోవటంతో మానసిక సమస్యలు మొదలవ్వటంతో మెంటల్ హాస్పిటల్ చేరుతున్నారు. రెండో సమస్య ఏమిటంటే పెయింట్లలో కలిపే వార్నిష్ లు, టర్పనటైల్ లాంటివి ఏవి దొరికితే అది తాగేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారట. అదీ దొరకని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ సమస్య ఒక్క తెలంగాణాలోనే కాదు ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్ధాన్, యూపి, పశ్చిమబెంగాల్లో కూడా పెరిగిపోతోందట. అందుకనే కంపెనీల సమఖ్య పై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయటం సంచలనంగా మారింది. ఇదే సమయంలో రాష్ట్రాల్లో మద్యం దొరకకపోవటంతో స్తోమత కలిగిన వారు బ్లాక్ లో కొంటున్నారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ కు ముందు 800 రూపాయలుండే రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ఇపుడు బ్లాకులో రూ. 3 వేలకు అమ్ముతున్నారు. సుమారు వెయ్యి రూపాయలుంటే మార్ఫ్యూస్ ఫుల్ బాటిల్ ఇపుడు రూ. 4 వేలకు అమ్ముతున్నారు.
అంటే ప్రభుత్వం మద్యం షాపులు మూసేయటంతో ఇదే బిజినెస్ లో ఉన్న వాళ్ళ పంట పండినట్లయ్యిందన్నమాట. షాపుల ఓనర్లే మద్యాన్ని అనధికారికంగా అమ్ముతున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఇదే విషయమై షాపులు, బార్లలో విచారణ జరిపిన ఎక్సైజ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు ఉన్న స్టాక్, తాజాగా ఉన్న స్టాక్ పై ఆరాతీసి మరీ కేసులు పెడుతున్నారు. దాంతో మాయమవుతున్న స్టాక్ మొత్తం బ్లాక్ లో అమ్ముడుబోతోందనే ప్రచారానికి ఊతమిచ్చినట్లైంది.
మద్యం ఓపెన్ మార్కెట్ లో దొరకటం లేదు కాబట్టే బ్లాకులో అమ్ముతున్నారు. అంటే ఒకవైపు ప్రభుత్వానికి నష్టం మరోవైపు మద్యం తాగేవాళ్ళ జేబులు చిల్లుపడిపోతున్నాయి. ఈ విషయాలన్నింటినీ కంపెనీల సమఖ్య ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో స్పష్టం చేసింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుని షాపుల్లో ఎప్పటిలా మద్యం అమ్మకాలు మొదలుపెడితేనే అందరికీ మేలని కూడా సలహా ఇచ్చింది. కేరళ, పశ్చిమబెంగాల్లో పరిమితింగా మద్యం అమ్మకాలకు అనుమతులివ్వాలని డిసైడ్ అయ్యాయి. మరి మిగిలిన ప్రభుత్వాలు ఎలా రియాక్టవుతాయో చూడాల్సిందే.