ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.
గత సంవత్సరం 11,162 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలకుగాను గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు 1,10,520 పోస్టులను రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేశారు.ఉద్యోగాల భర్తీ అనంతరం 19 కేటగిరీలలో 16,208 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాతపరీక్షలు నిర్వహించారు..
సచివాలయ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 10, 57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరయిన 7,68,965 మంది అభ్యర్థుల సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. అనంతరం ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన స్టాటిస్టికల్ టీమ్ ద్వారా మరోసారి పరిశీలించి నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. కాగా పరీక్ష రాసిన అభ్యర్థులు గ్రామ సచివాలయ అధికారిక వెబ్‌సైట్ http://gramasachivalayam.ap.gov.in/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.