iDreamPost
android-app
ios-app

ప్రధానితో తెలంగాణ గవర్నర్ భేటీ

ప్రధానితో తెలంగాణ గవర్నర్ భేటీ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.  అరగంటపాట సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితుల్ని గవర్నర్‌ ప్రధానికి వివరించారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమిళిసై మోదీని కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత 11 రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, ప్రధానితో భేటీ అనంతరం తమిళిసై హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.