iDreamPost
android-app
ios-app

నేను హీరోని కాదురా.. విలన్‌ని.. పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్..

  • Published Jun 12, 2022 | 5:22 PM Updated Updated Jun 12, 2022 | 5:22 PM
నేను హీరోని కాదురా.. విలన్‌ని.. పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్..

సీటిమార్ లాంటి మాస్ సినిమా తర్వాత గోపీచంద్ కామెడీ సినిమాలు తీసే మారుతితో జతకట్టాడు. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తూ సినిమాపై అంచనాలని పెంచుతున్నారు. ఈ సినిమా కూడా కామెడీతో పాటు మాస్ అంశాలని కలిపి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. ఇందులో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. అలాగే హీరో తండ్రి కూడా లాయర్. హీరో డబ్బులు తీసుకుంటూ డబ్బుల కోసం పని చేస్తూ తప్పులు చేసిన వాళ్ళని కూడా రక్షిస్తూ ఉంటారు. అలాగే రాశీఖన్నాకి సినిమా పిచ్చి ఉన్నట్టు చూపించారు. చివర్లో సీరియస్ మాస్ యాక్షన్స్ ఉన్నట్టు, తండ్రి కొడుకుల మధ్య పోరాటం జరిగినట్టు తెలుస్తుంది.

అయితే ట్రైలర్ చూస్తేనే ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందని అర్ధమవుతుంది. సినిమా మెయిన్ ప్లాట్ తెలియకపోయినా ట్రైలర్ చూస్తుంటే పటాస్, టెంపర్ లాంటి స్టోరీలా అనిపిస్తుంది. కాకపోతే అందులో వాళ్ళు పోలీసులు, ఇక్కడ గోపీచంద్ లాయర్. ఆ ఫ్లేవర్ అనిపించినా కథ వేరే ఉండొచ్చు. ట్రైలర్ బాగుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో గోపీచంద్ మరింత క్లాస్ లుక్ లో చాలా అందంగా కనిపించాడు. జులై 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler