iDreamPost
iDreamPost
గోదావరి వరద నిలకడగా సముద్రం వైపు సాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద స్థాయికి చేరువవుతోంది. (17.75 అడుగులకు మూడో హెచ్చరిక జారీ చేస్తారు) శుక్రవారం రాత్రి 8 గంటలకు సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.60 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. దీంతో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 18 లక్షల 78 వేల 736 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గత నాలుగు గంటలుగా నిలకడగా ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి భద్రాచలం వద్ద 55.30 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువనుంచి వచ్చే వరద స్థిరంగా ఉంటుంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు.