మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గని గతంలో రిలీజ్ డేట్ ని జులై 30గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కెజిఎఫ్ 2 తర్వాత రెండు వారాలు గ్యాప్ వచ్చేలా చూసుకుని మరీ ప్లాన్ చేసుకున్నారు. అయితే మొన్న లవర్స్ డే నాడు రాధే శ్యామ్ టీమ్ సైతం అదే తేదీని లాక్ చేసుకోవడంతో గనికి పెద్ద చిక్కే వచ్చి పడింది. పోనీ ముందుకు వద్దామంటే ఇప్పటికే దాదాపు అన్ని శుక్రవారాలు ప్యాక్ అయిపోయాయి. నాలుగైదు సినిమాలు క్లాష్ అవుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటప్పుడు గనికి ప్రీ పోన్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే వాయిదా వేయడం తప్ప మరో ఆప్షన్ అయితే దగ్గరలో కనిపించడం లేదు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం గనిని సెప్టెంబర్ కి షిఫ్ట్ చేసే ప్లానింగ్ జరుగుతోందట. అయితే ఇక్కడ మరో చిక్కు ఉంది. అదే నెలలో విజయ్ దేవరకొండ లైగర్ 9న వస్తోంది. దానితో నేరుగా పోటీ పడితే ఇబ్బంది. అందులోనూ రెండు సినిమాలు ఒకే తరహా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నాయి. లేనిపోని పోలిక వస్తే అనవసరమైన సమస్య. పోనీ లైగర్ కు ఎక్కువ గ్యాప్ ఇచ్చి వద్దామా అంటే అది హిట్టయి అందులో కొన్ని అంశాలు గనిలోనూ కనిపిస్తే కాపీ అనే కామెంట్స్ రావొచ్చు. కథలు పూర్తిగా వేరు ఉంటాయి కానీ లీడ్ క్యారెక్టర్ వృత్తి ఒకటే కాబట్టి వద్దన్నా జనం ప్లస్ మీడియా పోల్చి చూస్తారు. అందుకే తొందరపడక పోవడం మంచిది.
పోనీ ఆగస్ట్ లో వద్దామా అంటే వరుణ్ తేజ్ దే మరో సినిమా ఎఫ్3ని చివరి వారంలో 27కి షెడ్యూల్ చేశారు. సో నో ఛాన్స్. అదే నెలలో పుష్ప, మహాసముద్రంలు ఉన్నాయి. క్రేజ్ పరంగా దేనికవే అనే రేంజ్ లో అంచనాలు మోసుకొస్తున్నాయి. అందుకే సెప్టెంబర్ తప్ప వేరే ప్రత్యాన్మాయం లేనట్టే. ఎందుకంటే అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ ఉంది. అసలా నెల జోలికి ఎవరూ వెళ్లేందుకు సాహసించరు. ఇంకా లేట్ చేస్తే గని మీద భారం పెరుగుతుంది. సో ఇలా అన్ని కోణాల్లో రాధే శ్యామ్ వల్ల గని ఇరకాటంలో పడిపోయింది. మరి కొత్త డేట్ ని ఎలా ఎంచుకుంటుందో లేదా తప్పని పరిస్థితిలో పోటీకి సై అంటుందో వేచి చూడాలి