iDreamPost
iDreamPost
భారతీయ క్రీడలోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే దిగ్గజ క్రీడాకారుల్లో ఒకరైన మిల్కా సింగ్ మృతి చెందారు. వివిధ అంతర్జాతీయ వేదికల్లో భారతీయ పతాకాన్ని ఎగురవేసిన ఘనత ఆయనది. అథ్లెటిక్స్ లో అసమాన ప్రతిభావంతుడైన మిల్కా సింగ్ దేశంలో అనేక మందికి స్ఫూర్తినింపారు.
నవంబర్ 20, 1929లో పంజాబ్ లోని గోవిందాపురాలో ఆయన జన్మించారు. తొలుత భారత ఆర్మీలో సేవలు అందించారు. ఆయన క్రీడా ప్రతిభతో ఆసియా క్రేడలు, కామన్ వెల్త్ గేమ్స్ లో పలు పతకాలు సాధించారు. 1958,62 ఆసియన్ గేమ్స్ లో ఆయనకి 6 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. వరుసగా మూడు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. 400 మీటర్ల పరుగుపందెంలో 1960 రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ ఫైనల్స్ కి కూడా చేరారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది.
మిల్కా సింగ్ జీవిత కథను బాలీవుడ్ లో ‘బాగ్ మిల్కా సింగ్’ పేరుతో తెరకెక్కించారు. ప్రేక్షకులను అలరించారు. ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్ నటించిన ఈ సినిమాకి 2014 లో జాతీయ అవార్డు కూడా వచ్చింది
స్వాతంత్ర్య తొలినాళ్లలో పెద్దగా సదుపాయాలు లేకపోయినా ట్రాక్ అండ్ ఫీల్డ్స్ లో మిల్కా సింగ్ మెరుపు వీరునిగా అనేకమంది అభిమానం పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చండిఘర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మిల్కా సింగ్ మృతికి ఐదు రోజుల ముందు ఆయన జీవిత సహచరి నిర్మలా సింగ్ కన్నుమూశారు. ఆమె మరణంతో కలత చెందిన మిల్కా సింగ్ 91 ఏళ్ల వయసులో లోకానికి దురమయ్యారు
మిల్కా సింగ్ కోరుకోవాలని ఇటీవల ప్రధాని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆయన మరణం క్రీడాభిమానులను కలచివేసింది. దేశ కీర్తిని దశదిశలా చాటిన మేటి క్రీడాకారుడికి అనేక మంది నివాళి అర్పిస్తూ సంతాపం తెలియజేశారు.