iDreamPost
android-app
ios-app

ఘోర అగ్ని ప్రమాదం : 43మంది మృతి

ఘోర అగ్ని ప్రమాదం : 43మంది మృతి

దేశ రాజధాని లో ఈ రోజు ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ రాణి ఝాన్సీ రోడ్డులో అనధికారికంగా ఉన్న ఉన్న ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 43 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. గాయ పడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కనీస భద్రతా చర్యలు లేని భవనం లో ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకుగా ఉండటంతో.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి భద్రత సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇందులో చాలా మంది ఊపిరాడకనే చనిపోయినట్టుగా తెలుస్తోంది.

నివాస ప్రాంతాల్లో అక్రమంగా ఉన్న ఫ్యాక్టరీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన తరువాత అగ్నిమాపక సిబ్బంది గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి చాలా కష్టపడ్డారు. కనీసం అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేకపోవడంతో.. గాయపడ్డవారిని రోడ్డు వరకు భజాలపై మోసుకుంటూ రోడ్లపైకి తీసుకువచ్చి.. లోకల్‌ ఆటోల్లో ఆస్పత్రులకు తరలించారు. కాగా, కనీస భద్రత ప్రమాణాలు పాటించని భవనాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఈ ప్రమాదం మరోసారి రుజువు చేసింది.