iDreamPost
android-app
ios-app

అప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి

  • Published Mar 14, 2021 | 5:32 AM Updated Updated Mar 14, 2021 | 5:32 AM
అప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి

మొన్న శివరాత్రికి విడుదలై వసూళ్ల వీరవిహారం చేస్తున్న జాతిరత్నాలు దెబ్బకు దానికి సంబందించిన ఐదారుగురి జాతకాలు సమూలంగా మారిపోయేలా ఉన్నాయి. అందులో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఉంది. కళ్ళు చెదిరే గ్లామర్, స్కిన్ షో చేయడం లాంటివి ఏవీ లేకపోయినా కేవలం లుక్స్, స్మైల్, యాక్టింగ్ తో మెప్పించిన ఈ భామకు అప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ప్రభాస్ అంతటి పాన్ ఇండియా స్టార్ కే జోడి దొరక్క శృతి హాసన్ తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. దానికి తోడు డిమాండ్ ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్ళు బడ్జెట్ నిర్మాతలకు అందుబాటులో లేరు.

అందుకే ఏదైనా హిట్ సినిమాలో ఇలాంటి కొత్త హీరోయిన్లు మెప్పించేలా కనిపిస్తే చాలు నిర్మాతలు వెంటనే అలెర్ట్ అయిపోతున్నారు. తాజాగా రవితేజ త్వరలో ప్రారంభించబోయే కొత్త సినిమా కోసం ఫరియాను అడిగినట్టుగా తెలిసింది. ఇంకా కన్ఫర్మ్ అయ్యిందో లేదో తెలియదు కానీ ప్రపోజల్ అయితే వెళ్లినట్టుగా చెబుతున్నారు. అది త్రినాథరావు దర్శకత్వంలో మూవీకా లేక వేరేదానికా అనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సినిమా అయితే మాత్రం ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కెరీర్ ప్రారంభంలోనే రవితేజ లాంటి సీనియర్ హీరో సరసన అంటే మంచి ఛాన్స్ అనే చెప్పాలి.

ఇక జాతిరత్నాలు సంగతి చూస్తే ఈ రోజు ఆదివారం కొత్త రికార్డులు తిరగరాసేలా ఉంది. చాలా చోట్ల స్క్రీన్లు విపరీతంగా పెంచేశారు. దీని ధాటికి శ్రీకారం కూడా తట్టుకోలేకపోతోంది. ఇక గాలి సంపత్, రాబర్ట్ ల సంగతి సరేసరి. నవీన్ పోలిశెట్టి ఇప్పటికే హాట్ కేక్ గా మారగా ఆల్రెడీ డిమాండ్ ఉన్న రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. దర్శకుడు కెవి అనుదీప్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ అప్పుడే మొదలైపోయింది. తన సామజిక వర్గం నుంచి అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి తక్కువగా వస్తున్న తరుణంలో ఫరియా అబ్దుల్లా తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి