iDreamPost
android-app
ios-app

జాతిరత్నాలు హీరోయిన్ కు మరో ఛాన్స్

  • Published Jun 17, 2021 | 9:27 AM Updated Updated Jun 17, 2021 | 9:27 AM
జాతిరత్నాలు హీరోయిన్ కు మరో ఛాన్స్

లాక్ డౌన్ కు ముందు శివరాత్రి పండక్కు విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న జాతిరత్నాలు ఎంత బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ఏబిసి సెంటర్ల తేడా లేకుండా అన్ని చోట్ల భారీ వసూళ్లు దక్కించుకున్న ఈ ఎంటర్ టైనర్ వల్ల దర్శకుడు అనుదీప్ తో మొదలుకుని నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చిన మాట వాస్తవం. అయితే ఇదే సినిమా ప్రైమ్ లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నెగటివ్ కామెంట్స్ కూడా మర్చిపోకూడదు. ఏదేమైనా జాతిరత్నాలుకు చాలా అంశాలు కలిసి వచ్చాయి. ఆల్ టైం కామెడీ హిట్ అనలేం కానీ అందులో ఉన్న కంటెంట్ కంటే ఎక్కువ ఫలితాన్ని రాబట్టుకుంది.

ఇక హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. యాక్టింగ్ అందం రెండింటిలోనూ చాలా ప్లస్సులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో తననేమి ఆఫర్లు ముంచెత్తడం లేదు. తను ఒప్పుకోవడం లేదో లేక ఎత్తు సమస్యతో హీరోలు తనను ప్రిఫర్ చేయడం లేదో తెలియదు కానీ మొత్తానికి బండి స్లోగా ఉన్న మాట వాస్తవం. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దర్శకుడు శీను వైట్ల రూపొందిస్తున్న ఢీ సీక్వెల్ ఢీ అంటే ఢీలో హీరోయిన్ గా ఫరియానే ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. మంచు విష్ణు హీరోగా అతని స్వీయ నిర్మాణంలో మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లలేకపోయింది.

ఒకవేళ ఇది నిజమైతే ఫరియాకు గొప్ప ఛాన్స్ అనలేం కానీ సినిమా పెద్ద హిట్ అయితే ఉపయోగం ఉంటుంది. గత కొంత కాలంగా విష్ణుకు కనీస హిట్టు లేక బాగా ట్రబుల్ లో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తీసిన మోసగాళ్లు దారుణంగా దెబ్బ కొట్టడంతో బయట నిర్మాతలు మంచు విష్ణు మీద పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారు. అందుకే స్వంత ప్రొడక్షన్ లోనే విష్ణు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఢీకి ఇది కొనసాగింపు కాకపోయినా అందులో కొన్ని లింకులు ఈ కథకు ముడిపడి ఉంటాయట. శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి తదితరులు కాలం చేశారు కాబట్టి మొత్తం ఫ్రెష్ క్యాస్టింగ్ తో ఢీ అంటే ఢీని రూపొందిస్తున్నారు.