iDreamPost
iDreamPost
వచ్చే నెల రెండో వారం నుంచి షూటింగ్ ప్లాన్ చేసుకున్న ఎఫ్3కి అంతా అనుకూలంగా లేదని ఫిలిం నగర్ టాక్. ముఖ్యంగా వరుణ్ తేజ్ నుంచి స్టోరీ ప్లస్ రెమ్యునరేషన్ పరంగా వస్తున్న డిమాండ్ వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయని వినికిడి. వెంకటేష్ తో సమానంగా తనకూ పన్నెండు కోట్ల దాకా పారితోషికం ఇవ్వడం అందులో ఒకటైతే ఈ సీక్వెల్ లో తన క్యారెక్టర్ కు కొంత వెయిట్ పెంచాలన్నది మరొకటట. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ మొత్తానికి నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. క్యాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు.
సో ఇదంతా ఎలా ఉన్నా ఫైనల్ గా ఎఫ్3 ని మొదలుపెట్టడం అయితే పక్కా. తమన్నా, మెహ్రీన్ లు ఎలాగూ కంటిన్యూ అవుతారు. మిగిలిన క్యాస్టింగ్ తో పాటు ఈసారి సునీల్ ని జోడించే ఛాన్స్ ఉందంటున్నారు. వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, వరుణ్ తేజ్ బాక్సర్(ప్రచారంలో ఉన్న టైటిల్స్) షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. వచ్చే నెల లాంఛనంగా ఎఫ్3 మొదలుపెట్టినా రెగ్యులర్ షెడ్యూల్స్ కి కొంచెం టైం పట్టొచ్చు. ఆలోగా మిగిలిన వ్యవహారాలన్నీ చక్కదిద్దేస్తారు. గత ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్2కి సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉంటారు.
ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో పరాజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ లో నెలకొన్న సీక్వెల్ నెగటివ్ సెంటిమెంట్ ని ఎలా బ్రేక్ చేస్తాడో చూడాలి. బాహుబలి తప్ప ఇప్పటిదాకా ఏ కొనసాగింపు విజయం సాధించలేదు. గబ్బర్ సింగ్, కిక్ 2 లాంటివి దారుణంగా బోల్తా కొట్టాయి. అయితే అవి ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూగా తీసినవి కావు. కానీ ఎఫ్3 అలా కాకుండా ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఫినిష్ అయ్యిందో అక్కడి నుంచే కథను ముందుకు తీసుకెళ్తారట. దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మే నుంచి జూన్ మధ్యలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఎలాంటి బ్రేకులు లేకుండా సవ్యంగా జరిగితేనే.