iDreamPost
iDreamPost
టాలీవుడ్ లో సీక్వెల్ సెంటిమెంట్ ఒక్క బాహుబలి విషయంలో తప్ప ఇంకెవరికీ వర్కౌట్ కాకపోయినా వీటిని తీయడం మాత్రం మానడం లేదు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఒక్క వెంకటేషే ఏకంగా రెండు చేస్తున్న విషయం తెలిసిందే. దృశ్యం 2 షూటింగ్ పూర్తి కాగా ఎఫ్3కి దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెగటివ్ వచ్చింది కానీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆర్టిస్టులు రిస్క్ కి సిద్ధంగా లేరు. అల్లు అర్జున్ సైతం తప్పించుకోలేకపోయాడంటే ఎంత రిస్క్ లో షూట్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు
ఇదిలా ఉండగా ఎఫ్3 ముందు ప్రకటించిన ప్రకారం ఆగస్ట్ 27 రిలీజయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇంకా నారప్ప ఉంది. ఆపై దృశ్యం 2ని ప్లాన్ చేయాలి. ఈ రెండు సురేష్ బాబు నిర్మాణంలో జరిగినవి. ఏదీ డైరెక్ట్ ఓటిటికి ఇచ్చే సమస్యే లేదంటూ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన జూన్ నుంచి థియేటర్లు సాధారణ స్థితికి వచ్చినా అక్కడి నుంచి ఆరు నెలల గ్యాప్ లో వెంకీ మూడు సినిమాలు వదలడం ప్రాక్టికల్ గా అంత సులభం కాదు. పైగా ఎఫ్3కి సంబంధించి ఒక ఫారిన్ షెడ్యూల్ కూడా ఉందట. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎఫ్3ని 2022 సంక్రాంతి లేదా సమ్మర్ కు తీసుకెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేదు.
ఇప్పటికే ఎఫ్3 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం క్యాస్టింగ్ తో పాటు కొత్తగా సునీల్ లాంటి ఆర్టిస్టులకు తీసుకురావడంతో దీని రేంజ్ ఇంకా పెరిగింది. డబ్బు చుట్టూ తిరిగే కథలో అనిల్ రావిపూడి ఇందులో డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్నారని టాక్. అయితే ఈ వాయిదా ప్రహసనమంతా ఇప్పటికి చర్చల దశలోనే ఉంది. పోస్ట్ పోన్ కు సంబంధించిన కన్ఫర్మేషన్ రావడానికి టైం పడుతుంది. వెంకటేష్ మాత్రం హోమ్ రెస్ట్ లో ఉన్నారు. నారప్ప కొంత భాగం రీ షూట్ జరగొచ్చనే వార్తల నేపథ్యంలో దృశ్యం 2నే ముందు థియేటర్లలో అడుగు పెట్టేందుకు ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ కు ఏదైనా పండగేగా. వేచి చూద్దాం