iDreamPost
android-app
ios-app

అజిత్‌ జోగి అస్తమయం

అజిత్‌ జోగి అస్తమయం

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి అస్తమించారు. హృదయ సంబంధిత ఆనారోగ్యంతో గత మూడు వారాలుగా ఆస్పత్రినలో చికిత్స పొందుతున్న 74 ఏళ్ల అజిత్‌ ఈ రోజు గుండెపోటుతో మరణించారు. ఐఏఎస్‌ అధికారి అయిన అజిత్‌ జోగి ఆ ఉద్యోగాన్ని వదిలి 1986లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన 1986–98 కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్‌ పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన 1981–85 వరకు ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

ఛత్తీస్‌గఢ్‌ ఏర్పాటైన ప్రారంభంలోనే అజిత్‌ జోగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 2000–2003 వరకూ ఆయన ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా బాధ్యలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. 2016లో అజిత్‌ జోగి కాంగ్రెస్‌తో విభేధించి తన కుమారుడుతో కలసి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ అనే పేరున కొత్త పార్టీ స్థాపించారు. 2019లో ఆయన ఎస్టీ కాదంటూ జుడీషియల్‌ కమిటీ దర్యాప్తులో తేలడంతో ఆయనపై కేసు నమోదైంది. ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు.