Idream media
Idream media
దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అత్యాచారం, హత్య జరిగిన ప్రాంతంలోనే నిందితులను సిన్ రికన్స్ట్రక్ట్ కోసం తీసుకెళ్లిన పోలీసులు ఆ పై అక్కడ జరిగిన పరిణామాలతో ఎన్కౌంటర్ చేసారు. తమ పై దాడికి దిగారని పోలీసులు చెబుతున్నారు. తమ ఆయుధాలను లాక్కొని కాల్పులు జరపడంతో.. తాము ఫైర్ ఓపెన్ చేశామని చెప్పుకొస్తున్నారు.
మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం. ఐతే ఇందులో 4 రౌండ్లు మిస్ ఫైర్ అవ్వగా నిందితుల శరీరాల్లోకి 11 బుల్లెట్లు దుకుకెళ్లాయి. మహమ్మద్ ఆరిఫ్ (ఏ–1) శరీరంలో నాలుగు బుల్లెట్లు, జొల్లు శివ (ఏ–2) శరీరంలో మూడు, జొల్లు నవీన్ (ఏ–3) శరీరంలో మూడు, చెన్నకేశవు లు (ఏ–4) శరీరంలో ఒక బుల్లెట్‌ను వైద్యాధికారుల బృందం గుర్తించినట్లు సమాచారం.