[ గమనిక : ఇప్పుడు నేను చెప్పే నా ఈ ఆలోచనలో పూర్తిగా నాకే ఒక క్లారిటీ లేదు…
కానీ వచ్చిన ఈ బేసిక్ ఆలోచనని ఎందుకో మీతో పంచుకోవాలని అనిపించింది.
దీని వల్ల మీరు కూడా మీ అభిప్రాయాలని పంచుకుంటే ఈ ఆలోచనకి ఒక పరిపూర్ణమైన రూపం రావొచ్చేమో అన్నది నా ఉద్దేశం.
లేదూ..ఈ ఆలోచనే సరి అయినది కాదూ అనుకుంటే దీన్ని మీరు పెద్ద సీరియస్ గా తీసుకునే అవసరం లేదు.]
—————————–
ఇక్కడ నేను చెప్పే విషయాలు కొంతమందికి రుచించకపోవొచ్చు…
కానీ చెప్తాను…
కరోనా ఎలాగూ దేశం లో ప్రవేశించింది…
దాన్ని కట్టడి చెయ్యడానికి ప్రభుత్వం రకరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.
చేతులు కడుక్కోమంటుంది,మాస్కులు వాడమంటుంది,పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళొద్దొంటుంది,అనవసరపు ప్రయాణాలు చెయ్యొద్దంటుంది….ఇలా రకరకాలుగా….
సరే..ఇవన్నీ చాలా మంది పాటిస్తున్నారు,కొంతమంది అశ్రద్ధగా ఉంటున్నారు.
తర్వాత చర్యలుగా స్కూల్స్,సినిమా హాల్స్,షాపింగ్ మాల్స్, ఫిట్ నెస్ సెంటర్స్ ఇలా అన్నీ మూయించేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా హాస్టల్స్ కూడా మూయించేస్తున్నారు.
వచ్చే వారం లో అన్ని ప్రైవేట్ ఆఫీసులని కూడా మూయించేస్తారని ఒక వార్త వస్తోంది..
అందులో ఎంత నిజం ఉందో తెలీదు.
ఈ చర్యలన్నింటిలోనూ కూడా ప్రభుత్వ ఉద్దేశం చాలా మంచిది…
ఎక్కడికీ వెళ్ళకుండా ప్రజలని ఇంటిపట్టునే ఉంచడం అన్నది ప్రభుత్వ ఉద్దేశం…చాలా మంచిది.
అలా చేస్తే అతి తక్కువ సమయం లో వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవకుండా తొందరగా అంతమవుతుంది.
కానీ తెలియకుండా ఈ చర్యలో అతిపెద్ద నష్టం మరియు ప్రమాదం పొంచి ఉంది.
అదేంటంటే…అన్నీ బంద్ చేయించారు ఓకె…బట్ వాడు బతకడం ఎలా….?
అందరికీ బ్యాంకు బ్యాలెన్సులు ఉండవు కదా…..
సేవ్ చేసుకున్న మనీ ఉండదు కదా…
అన్నీ మూయించేశారు ఓకె…బట్…వాటి రెంట్ మాత్రం ఆగదు కదా….
1st రాగానే బిజినెస్ లేదని చెప్పినా..రెంట్ విషయం లో ఓనర్ ఆగడు కదా…?
అఫీసులన్నీ మూయించేస్తారు ఓకె..
అందరూ జీతాలు లేకుండా ఇంట్లో కూచుంటారు…
ఓనెర్ రెంట్ అడగకుండా ఉండరు కదా…
రోజువారీ కూళీలుగా చేసేవారికీ,రోజు వారీ వేజెస్ తీసుకునే వాళ్ళకి ఒక్క రోజు పని లేకపోతే ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది.
మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి..?
తమ పొట్ట నింపుకోవడం వరకు ఏ వ్యక్తికి పెద్ద కష్టం కాదు..
కానీ మిగతా విషయాలు,మిగతా ఖర్చుల పరిస్థితి…?
ఎవరికయినా ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం కష్టమేమోగానీ,కొద్ది రోజులు డబ్బులు తీసుకోకుండా ఉండటం పెద్ద కష్టం కాదు.
కొంతమందికి కొంచెం ఇబ్బంది అనిపించినా వీటన్నిటికీ చాలా సులభమైన పరిష్కారం ఒకటుంది. .
అదేంటంటే ఎన్ని రోజులయితే గవర్నమెంట్ ఈ నిషేదాన్ని ఉంచుతుందో అన్ని రోజులూ ఎవరికీ ఎటువంటి బిల్స్ కట్టే అవసరం లేదనే రూల్ పెట్టాలి.
నిషేదం ఎత్తివేసేంతవరకూ ఎటువంటి రెంట్స్ కట్టే అవసరం లేదని ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చెయ్యాలి.
షాప్స్,బిజినెస్ బిల్డింగ్స్ తో పాటు ఇంటి రెంట్స్ కూడా ఆ నిషేదం ఉన్నన్ని రోజులు ఓనర్స్ వసూలు చెయ్యకూడదు.
ఇప్పుడు రెంట్ కి ఉన్నవాళ్ళు ఖాళీ చేస్తే అర్జెంట్ గా ఆ బిల్డింగ్ లోకి వేరేవాళ్ళు వచ్చి చేరే పరిస్థితి ఎలాగూ ఉండదు కాబట్టి ఆ బిల్డింగ్ ఓనర్ రెంట్ తీసుకోకుండా ఉండటం వలన పెద్ద నష్టం ఏమీ జరగదు…
అలా ప్రతీ డిపార్ట్మెంట్ లోని బిల్స్ ని ఈ నిషేదం టైం లో ఆపేసేయాలి.
బ్యాంక్ కి సంబంధించిన మంత్లీ లోన్ ఇన్స్టాల్మెంట్ కావొచ్చూ, కార్ లోన్స్ కావొచ్చు.. వడ్డీకి తీసుకున్న డబ్బుకి వడ్డీ కావొచ్చు.. ఇంకా ఎలాంటి లావాదేవీలయినా కూడా ఈ నిషేధం టైం లో ఎత్తివెయ్యాలి అనే ఆర్డర్ ని పాస్ చెయ్యాలి…
ఉదాహరణకి చాలా స్కూల్స్ లో ఇన్స్టిట్యూట్స్ లో ఫీజులు వసూలు చేసే టైం కి, అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యే టైం కి ఈ కరోనా వల్ల అన్నీ మూసేయాల్సి వచ్చింది.
దానివల్ల రావాల్సిన డబ్బు ఆగిపోయింది.
మరి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆగలేరు కదా…?
రెంట్స్ ఆగవు కదా…?
అందుకని నష్టాన్ని అందరూ సరిసమానంగా పంచుకుని భరించాలి …
ఇదొక చైన్ సిస్టం… లింక్ సిస్టం..
మనం ఒకరి నష్టాన్ని భరిస్తే మన వల్ల జరిగే నష్టాన్ని ఇంకొకరు భరిస్తారు.
కేవలం నిత్యావసర వస్తువులు తప్ప దేనికీ చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
లేదూ…కేవలం ఇళ్ళల్లో కూచుంటే కరోనా తగ్గిపోతుంది అనుకుంటే అవసరం,ఆకలి మనిషి చేత మర్డర్లు
కూడా చేయించే ప్రమాదం ఉంది …
కరోనాను తగ్గించే ఆత్రుతలో క్రైం రేట్ పెరిగే అవకాశం ఇవ్వకండి.
మన జీవితాలు అస్తవ్యస్తం కాకుండా ప్రభుత్వానికి ఇదే నా విన్నపం.
ఒక్క రెండు నెలలు ఎలాంటి బిల్స్ పే చెయ్యొద్దనే ఆర్డర్ పాస్ చెయ్యండి…
ఈ ఆర్డర్ పాస్ చేస్తేనే ఈ దేశపౌరులు ధైర్యంగా మీరు చెప్పినట్టు ఇంట్లో కూచోగలరు…
తద్వారా కరోనా సమస్య అతి త్వరగా పరిష్కారం అవొచ్చు.
మీరు ఆ ఆర్డర్ పాస్ చేశాక రోడ్ల మీద తిరిగితే కాల్చి చంపుతాం అనే రూల్ పెట్టినా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవొచ్చు.
ఒక్కసారి ఆలోచించు ప్రభుత్వమా…
అసలు గవర్నమెంట్ ఆర్డర్ తో సంబంధం లేదు…ప్రజలం మేమే ఇది పాటించి చూపిస్తాం అంటే అంతకన్నా కావాల్సింది ఏముంది..?
ప్రాణాలకంటే పైసలు గొప్పవి కావు…
మనిషి ఉనికి కంటే మనీ గొప్పది కాదు…
ఆ మనిషే లేకపోతే మనీ ఎందుకు…?
కొన్ని కాపాడుకోవాలంటే కొంత త్యాగం త్యాగం చెయ్యాల్సిందే. – TNR
———————————————–
[ గమనిక : రోజువారీ కూలీల డబ్బులని ఆపడం ఇందులోంచి మినహాయించడం బెట్టరేమో…
నా ముఖ్య ఉద్దేశం అన్ని రెంట్స్ ఆపేస్తే బెట్టర్ అని…
ఇది నా బేసిక్ ఆలోచన మాత్రమే.
నా ఆలోచనలో చాలా లోపాలు ఉండొచ్చు..
ఈ ఆలోచన ఆచరణకి అసాధ్యం అనిపించేలా ఉండొచ్చు.
కానీ..నా ఆలోచనలను తగురీతిలో సవరించి వాటిని సరిచేస్తే ప్రభుత్వం ఒక మంచి ప్రణాలికను తీసుకురావచ్చేమో అన్నదే నా ఉద్దేశం.
ఇలాంటి కష్టకాలం లో తలా ఒక చెయ్యివేస్తే సాధ్యం కానిది లేదని నా అభిప్రాయం.- TNR ]
—————————-