iDreamPost
android-app
ios-app

నెట్ జనాలకు కనెక్ట్ కాలేదా ?

  • Published Apr 13, 2021 | 4:55 AM Updated Updated Apr 13, 2021 | 4:55 AM
నెట్ జనాలకు కనెక్ట్ కాలేదా ?

చిన్న సినిమాగా విడుదలై కేవలం 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో మూడు వారాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించిన జాతిరత్నాలు సరిగ్గా నెల రోజుల గ్యాప్ తో మొన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన సంగతి తెలిసిందే. హాళ్లలోనే బ్రహ్మాండంగా ఆడిన ఈ మూవీకి ఓటిటిలోనూ బ్రహ్మరధం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ సోషల్ మీడియా ట్రెండ్ గమనిస్తే సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. థియేటర్లో చూడని ప్రేక్షకులు ఆన్ లైన్లో చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. ఇంతోటి కామెడీకి అంత గొప్ప రెస్పాన్స్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు

ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోది. థియేటర్ కు ఓటిటి కు ఆడియన్స్ అభిరుచుల్లో వ్యత్యాసాలు ఉంటాయి. అందులోనూ ఇంట్లోనే కూర్చునే సౌలభ్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఓపిక స్థాయి తక్కువగా ఉంటుంది. ఏ చిన్న అసహనాన్ని భరించడానికి వ్యూయర్ ఇష్టపడడు. దాంతో చాలా తేలికగా ఫార్వార్డో లేదా కాసేపు ఆపేసి పనులు చూసుకొచ్చి మళ్ళీ కంటిన్యూ చేయడమో చేస్తాడు. దీని వల్ల ఫీల్ తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. అదే హాల్ అయితే స్క్రీన్ మీద ఏకాగ్రత పెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. మరీ విసుగనిపిస్తే చేతిలో స్మార్ట్ ఫోన్ తో టైం పాస్ చేయడం తప్ప. అందుకే అనుభూతుల్లో వ్యత్యాసం ఉంటుంది.

ఇప్పుడు జాతిరత్నాలు విషయంలో జరుగుతోంది అదే. రేపు ఉప్పెన నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న నేపథ్యంలో దీనికి ఆన్ లైన్ జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి. సో డిజిటల్ ఫార్మట్ థియేట్రికల్ ఫార్మాట్ రెండూ వేర్వేనే క్లారిటీ వచ్చేసింది. కంటెంట్ మరీ బలంగా ఉన్నప్పుడు రెండింట్లోనూ ఒకే అభిప్రాయం కలుగుతుంది కానీ ఎంత పెద్ద హిట్ అయినా కొంత డివైడ్ టాక్ వచ్చిన జాతిరత్నాలు లాంటి సినిమా మాత్రం ఓటిటిలో విభిన్న అభిప్రాయాలు తెచ్చుకుంటుంది. ఇదే నెలలో అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, తెల్లవారితే గురువారం, శ్రీకారం, చెక్ కు రాబోతున్నాయి. చూడాని వాటినెలా రిసీవ్ చేసుకుంటారో