iDreamPost
android-app
ios-app

దిశా నిందితులు గతంలో కూడా అత్యాచారం,హత్యలు చేశారా?

దిశా నిందితులు గతంలో కూడా అత్యాచారం,హత్యలు చేశారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా హత్యాచార ఘటనలో నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా దిశా కేసు నిందితులు ఇంతకు ముందు కూడా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగించారని తెలుస్తుంది. అనేక హత్యాచార ఘటనలలో వీరి పాత్ర ఉందని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. వీరిలో ప్రధాన నిందితుడు ఆరిఫ్ అలీ 6 హత్యా నేరాలను ఒప్పుకోగా,చెన్నకేశవులు 3 హత్యా నేరాలను అంగీకరించ్చినట్లు సమాచారం.హైవే ప్రాంతాల్లో ఒంటరిగా దొరికిన మహిళలను ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యచేసిన అనంతరం మృతదేహాలను దహనం చేసినట్లు నిందితులు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తుంది.

ఈ హత్యలన్నీ  సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, కర్నాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారని, వారు నేరాలు చేసినట్లు ఒప్పుకున్న ప్రాంతాల్లో ఇప్పటివరకు 15 సంఘటనలు జరిగాయని పోలీసులు గుర్తించారు. దిశా నిందితుల డిఎన్ఏను దహనమైన మృతదేహాల డిఎన్ఏ తో సరిపోల్చి విశ్లేషిస్తున్నారు. కానీ చాలావరకు మృతదేహాలు పూర్తిగా దహనం కావడంతో డిఎన్ఏ ఫలితాలు సరైన విధంగా ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీనితో శాస్త్రీయ ఆధారాలని సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

హైదరాబాద్ శివారులో టోల్ ప్లాజా సమీపంలో దిశపై నలుగురు నిందితులు పాశవికంగా హత్యాచారం చేసి దిశా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసారు. దీనితో సర్వత్రా ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేసారు. కాగా దిశా వస్తువులను చూపిస్తామని పోలీసులను దిశను హత్య చేసి దహనం చేసిన ప్రదేశానికి నిందితులు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల ఆయుధాలు లాక్కుని పోలీసులపై రాళ్ళూ కర్రలతో దాడి చేసి తప్పించుకోవాలని చుసిన నిందితులను ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.