iDreamPost
android-app
ios-app

పుష్ప కోసం డిజాస్టర్ విలన్ ?

  • Published Nov 13, 2020 | 6:04 AM Updated Updated Nov 13, 2020 | 6:04 AM
పుష్ప కోసం డిజాస్టర్ విలన్ ?

ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ఇటీవలే పుష్ప షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత ఏకంగా రెండున్నరేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు సుకుమార్ దీని మీద చాలా కసిగా ఉన్నాడు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత తన మార్కెట్ ని మరింత బలపరుచుకునే క్రమంలో అల్లు అర్జున్ కూడా దీని మీద గట్టి ఫోకస్ పెట్టాడు. ఎర్ర చందనం దొంగతనం చేసే లారీ డ్రైవర్ పుష్పగా ఇందులో బన్నీ పాత్ర చాలా ఊర మాస్ గా ఉండబోతోంది. హీరోయిన్ రష్మిక మందన్న దీని కోసమే ప్రత్యేకంగా చిత్తూరు స్లాంగ్ నేర్చుకుని మరీ రెడీ అయ్యింది. తను కూడా ఈ షెడ్యూల్ లోనే జాయిన్ కాబోతోంది.

ఇక ఇప్పటిదాకా పుష్ప విలన్ ఎవరు సస్పెన్స్ మాత్రం కొనసాగుతూ వచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం తమిళ హీరో ఆర్య ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముందు విజయ్ సేతుపతి అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల కాల్ షీట్స్ వృధా కావడంతో అతను డ్రాప్ అయ్యాడు. తర్వాత బాబీ సింహ, కిచ్చ సుదీప్, సునీల్ శెట్టి ఏవేవో పేర్లు వినిపించాయి. అవేవి నిజమని తేలలేదు. ఇప్పుడు ఫ్రెష్ గా ఆర్య తెరమీదకు వచ్చాడు. ఇప్పటికే పుష్ప బాగా ఆలస్యమయ్యింది. ఇంకా లేట్ చేసే కొద్దీ విడుదలతో పాటు నెక్స్ట్ బన్నీ చేయాల్సిన కొరటాల శివ ప్రాజెక్ట్ కూడా లేట్ అవుతుంది.

అందుకే ఆర్య వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే ఇక్కడే అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆర్య గతంలో బన్నీతో వరుడు సినిమాలో విలన్ గా నటించాడు. అది డిజాస్టర్. ఇప్పటికీ ఫ్యాన్స్ దాన్ని తలుచుకుని మరీ భయపడుతుంటారు. మరి అంత నెగటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఎలా అనేది వాళ్ళ టెన్షన్ కు కారణం కావొచ్చు. అయినా కంటెంట్ లో సత్తా ఉన్నప్పుడు ఇవేవి పనిచేయవు కానీ నిజంగా ఆర్య మంచి టాలెంట్ ఉన్న నటుడు. వరుడు పోయినా అందులో ఇతని విలనీ మాత్రం బ్రహ్మాండంగా పండింది. పుష్పకు కూడా ఖచ్చితంగా రైట్ ఛాయస్ అవుతాడు