iDreamPost
android-app
ios-app

Kurnoll TDP Kotla KE family -కర్నూలు టీడీపీలో అంత‌ర్యుద్ధం : బాబు చెప్పినా అదే ప‌రిస్థితి!

Kurnoll TDP Kotla KE family -కర్నూలు టీడీపీలో అంత‌ర్యుద్ధం : బాబు చెప్పినా అదే ప‌రిస్థితి!

అస‌లే టీడీపీకి రాష్ట్రంలో ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. ఇటువంటి ప‌రిస్థితుల్లో నేత‌ల మ‌ధ్య కుమ్ములాట‌లు మ‌రింత త‌ల‌నొప్పిగా మారాయి. క‌ర్నూలు జిల్లాలో కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో అభాస‌పాల‌వుతున్న పార్టీలో నేత‌ల తీరుతో మ‌రింత గంద‌ర‌గోళంగా ఉంది. అక్క‌డ అధికార పార్టీ వైసీపీ రోజురోజుకూ బ‌లోపేతం అవుతుంటే.. క‌లిసిక‌ట్టుగా టీడీపీని పైకి లేపాల్సింది పోయి.. ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తూ నేత‌లు ఆ దిశ‌గా దృష్టి సారించ‌డం లేదు. ప్ర‌ధానంగా రెండు కుటుంబాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీలోనే కుంపటి రగిల్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుదుర్చేందుకు స్వ‌యంగా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో మార్పు రాలేద‌ని సమాచారం.

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ విషయమై ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా కోట్ల సుజాతమ్మ ఉన్నారు. కానీ ఇటీవల కేఈ ప్రభాకర్ ఎక్కువగా ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడి టీడీపీ శ్రేణులను తనవైపు తిప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నందుకే ఆయన ఇప్పటి నుంచే పార్టీ స్థానిక నేతలను కార్యకర్తలను మచ్చిక చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సుజాతమ్మకు ప్రభాకర్ వ్యవహార శైలి రుచించడం లేదు. అందుకే ఆమె బాబును కలిసి పరిస్థితులను వివరించారు.

ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నారని అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బాబును సుజాతమ్మ కోరినట్లు తెలిసింది. కానీ బాబు మాత్రం.. సుజాతమ్మను డోన్ నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు అక్కడ మంచి పరిచయాలు ఉంటాయని అందుకే అక్కడి నుంచి పోటీ చేయాలని బాబు చెప్పారని టాక్. కానీ ఎంపీగా తన భర్త కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి ఆలూరు అయితే పార్లమెంట్కు కూడా బాగా కలిసొస్తుందని సుజాతమ్మ చెప్పిన ఆమె మాటను బాబు పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీ అభ్యర్థిని దించే ఆలోచనలో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే కోట్ల కుటుంబాన్ని డోన్ కు పంపించి.. ఆ దంపతుల్లో ఒకరికి మాత్రమే సీటు ఇవ్వాలని బాబు అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆ కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే దక్కుతుందనే విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన కేఈ ప్రతాప్ కు ఈ సారి అక్కడ అవకాశం ఉంటుందా అనేది అనుమాన‌స్ప‌దంగా మారింది.

ఇలా రెండు కుటుంబాలకు అసంతృప్తి కలిగించేలా బాబు నిర్ణయం తీసుకోవడం కర్నూలులో పార్టీ పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆశించిన టికెట్లు దక్కనపుడు వచ్చే ఎన్నికల్లో అదే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని అలా జరిగితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత 20 ఏళ్లలో కర్నూలులో టీడీపీ ఎప్పుడూ ఆశాజనక ఫలితాలు సాధించలేదని ఈ నేపథ్యంలో అక్కడ బలహీనంగా ఉన్న పార్టీ తరపున ఎవరు ఎక్కడ పోటీ చేసినా మార్పు పెద్దగా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : Ex Minister DL-డీఎల్ ఏం ఆశిస్తున్నారు. రాజకీయ ప్రకటనల వెనుక అసలు లక్ష్యం అదేనా

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasino