iDreamPost
android-app
ios-app

KGF దర్శకుడి మాస్టర్ స్కెచ్

  • Published May 21, 2020 | 5:13 AM Updated Updated May 21, 2020 | 5:13 AM
KGF దర్శకుడి మాస్టర్ స్కెచ్

చేసినవి రెండే సినిమాలు. డెబ్యూ మూవీ కర్ణాటకలో హిట్ అయినా అతని గురించి ఆ రాష్ట్రం సరిహద్దులు దాటి ఎవరికీ తెలియదు. కానీ కెజిఎఫ్ వచ్చాక ఆ పేరు దేశమంతటా కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రాలు చూసే ప్రతిఒక్కరి మదిలో మారుమ్రోగిపోయింది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాప్ మోస్ట్ హాట్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఏకంగా బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయంటే ఇతని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కెజిఎఫ్ చాప్టర్ 2 అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.

థియేట్రికల్ రైట్స్ కాకుండానే రెండు వందల కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ టాక్. లాక్ డౌన్ అయ్యాక బాలన్స్ ఉన్న పాతిక రోజుల షూటింగ్ చకచకా పూర్తి చేస్తారు. మరోవైపు ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తాను త్వరలో పవర్ హౌస్ తో కలిసి పనిచేయబోతున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించడంతో యంగ్ టైగర్ అభిమానుల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. కెజిఎఫ్ రిలీజ్ టైంకి బయటి మార్కెట్స్ లో ఇమేజ్ లేని యాష్ నే ఆ రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్ తమ హీరోని ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని ఊహించుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మైత్రి బ్యానర్ లో రూపొందబోయే ఈ క్రేజీ మూవీకి గాను ప్రశాంత్ నీల్ కు సుమారు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్.

కేజిఎఫ్ ఇండస్ట్రీ హిట్ అయినప్పటికీ కన్నడలో ప్రతిసారి అంత భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలు దొరకరు. అందులోనూ యష్ లాంటి హీరోలు తక్కువ. అందుకే ప్రశాంత్ నీల్ ఇక్కడ స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. రాజమౌళి తరహాలో ప్రశాంత్ నీల్ పేరు ప్రొడ్యూసర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ రెండు పూర్తయ్యేలోగా వచ్చే ఏడాది సమ్మర్ దాటిపోతుంది. ఆలోగా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయ్యేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడట. హీరో ఎలివేషన్స్ చూపడంలో బెస్ట్ ఇచ్చే ఈ దర్శకుడు యంగ్ టైగర్ లాంటి పవర్ హౌస్ ని ఎలా వాడుకుంటాడో వేచి చూడాలి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş