iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ కి చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వైఎస్సార్ గురించి ఇంకా జనంలో మాట్లాడుకోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్టీఆర్ గురించి సినీ రంగ ప్రముఖుడిగా నేటికీ గుర్తు పెట్టుకున్న జనాలను ప్రజా నేతగా వైఎస్సార్ ని మాత్రం మరచిపోలేదు. అందుకు అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వం కీలకమైనది. ఆయన నమ్మిన వాళ్ల కోసం నిలబడతారని, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కష్టపడ్డారనే అభిప్రాయం మెజార్టీ జనాల్లో ఉంది. అదే సమయంలో చంద్రబాబు ఏపీలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడే అయినప్పటికీ ప్రస్తుతం ప్రజలకు ఆయన చేరువ కాలేకపోతున్నారు. వైఎస్సార్ ని మరణించిన పుష్కర కాలం తర్వాత కూడా జన హృదయాల్లో నిలుపుకున్న ప్రజలు, చంద్రబాబు చివరి దశలో ఆయన సొంత నియోజకవర్గంలోనే చెమటలు పట్టిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకు వ్యక్తిత్తమే ముఖ్యమైనది.
తాను చెప్పింది ఆచరిస్తే వారు ప్రజా నేతలవుతారు. కలకాలం జనంలో నిలుస్తారు. తనకు తోచింది చేస్తూ, మీడియా, ప్రసార సాధానాల సహాయంతో మభ్యపెడదామనుకుంటే అది తాత్కాలికంగానే నిలుస్తుంది. విజనరీ అని, పాలనాదక్షుడని ఇలాంటి అనేక ముద్రలు వేయించుకున్న చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని జనం భావించారు. అందుకే 2019 నుంచి వరుస ఎన్నికల్లో ఆయన్ని దూరం పెడుతూ వస్తున్నారు. ఆయన హయంలో వ్యవహరించిన తీరు మూలంగానే ఈ స్థితిని కొనితెచ్చుకున్నట్టయ్యింది. పదే పదే యూటర్న్ లు తీసుకుంటూ ప్రజల్లో పలుచన అయిపోయినట్టు కనిపిస్తోంది. రుణమాఫీ నుంచి కాపు రిజర్వేషన్ల వరకూ, ప్రత్యేక హోదా నుంచి స్పెషల్ ప్యాకేజీ ఏ అంశంలోనూ తాను చెప్పిందానికి కట్టుబడకపోవడం చంద్రబాబు నిజస్వరూపాన్ని జనాలకు అర్థమయ్యేలా చాటిచెప్పింది. ఒకనాడు మీడియా చేతుల్లో పెట్టుకుని మభ్యపెట్టినా సోషల్ మీడియా కాలంలో అది సాధ్యం కాకపోవడం చంద్రబాబు దురదృష్టానికి మరో కారణం.
Also Read : Southern Council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే
ప్రతీ అంశంలోనూ ఎప్పటికెయ్యది ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడు అనే ముద్ర బలపడింది. దాంతో బాబుని జనం మళ్లీ ఆదరించే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. అధికారంలో ఉండగానే కాకుండా విపక్షంలోకి వెళ్లిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో కూడా అదే తంతు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను ఏమార్చేయత్నమే తప్ప నిజాయితీగా జనంలో ఎదగాలనే సంకల్పం ఆయనకు లేదు. అందుకే చంద్రబాబు ని జనం హర్షించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. అదే సమయంలో వైఎస్ జగన్ మాత్రం అనువుగాని చోట కూడా తన మాటలను తప్పకుండా ముందుకు సాగుతున్నారు. అనేక సమస్యలున్నా ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడడంలోనూ, సంక్షేమ పథకాలు అమలులోనూ సమర్థత చాటుతున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా వంటి రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో కేంద్రంతో వీలున్న ప్రతీ సారి ప్రస్తావించడం జగన్ తీరుని చాటుతోంది.
ఒకసారి హోదా, మరోసారి ప్యాకేజీ, ఇంకోసారి రెండూ వస్తున్నాయంటూ చంద్రబాబు మభ్యపెడితే, జగన్ దానికి విరుద్ధంగా సాగుతున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాల హక్కులకు ఎక్కువ అవకాశం ఉంటుందనే భావనతో ఉన్న జగన్ దానికి విరుద్ధంగా బంపర్ మెజార్టీతో బీజేపీ గెలిచిన వెంటనే ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి ఫలితాలు వస్తాయని ఆశించడం లేదు గానీ ప్రతీసారి తాము ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటామని చెప్పారు. దానికి తగ్గట్టుగా తాజాగా సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగులో కూడా హోదా నుంచి అన్ని అంశాలను ప్రస్తావించారు. విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని నొక్కి వక్కాణించారు. ఏపీకి న్యాయం జరగాలని కేంద్రాన్ని కోరారు. ఇలా తన అభిప్రాయాన్ని అమిత్ షా ముందు స్పష్టంగా వెల్లడించడం ద్వారా జగన్ తానేంటో చాటుకున్నారు. రాష్ట్ర హక్కుల విషయంలో తప్పించుకోవడం కాకుండా, కేంద్రం ముందు ప్రతిపాదించడం ద్వారా మాట తప్పని నేతగా నిరూపించుకున్నారు. చంద్రబాబు ధోరణికి, జగన్ కి చాలా తేడా ఉందని చెప్పకనే చెప్పారు. ఇదే ఈ నాయకుల్లిద్దరి మధ్య తేడా అని స్పష్టంగా తెలిసేలా చేశారు. దాంతో కేంద్రం స్పందిస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కప్పదాట్లు లేని తీరుని ప్రదర్శించిన జగన్ చాలామందిని ఆకట్టుకున్నారు.
Also Read : Vijay Sai Reddy -వైసీపీ ఎంపీతో టచ్ లో ఉన్న ఆ టీడీపీ బడా నేతలెవరు?