iDreamPost
iDreamPost
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యని అందించేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో మరో ముందడుగు వేసింది .
మొదట అమ్మవడి పధకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్ధికంగా ఆసరా అందించి ఆర్ధిక ఇబ్బందులతో ప్రాధమిక స్థాయిలో ఉండే స్కూల్ డ్రాపవుట్స్ ని తగ్గించిన జగన్ నాడు నేడు పధకం ద్వారా దశాబ్దాలుగా సౌకర్యాల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు , టాయిలెట్స్ , విద్యుత్ కనెక్షన్స్ లాంటి కనీస సౌకర్యాలు సమకూర్చటంతో పాటు ప్రయివేటు పాఠశాలల కన్నా మిన్నగా విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పాఠశాల భవనాలని తీర్చిదిద్దారు .
ఈ చర్యల వలన స్కూల్ డ్రాపవుట్స్ తగ్గడంతో పాటు , చాలా మంది తల్లిదండ్రులు ప్రయివేట్ స్కూల్స్ లో చదువుతున్న తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి మొగ్గు చూపడంతో గత ఏడాది అడ్మిషన్స్ సంఖ్య భారీగా పెరిగింది . ఈ విద్యార్థులందరికీ కనీస అవసరాలైన బుక్స్ , స్టేషనరీ , యూనిఫామ్ , షూ , బెల్ట్స్ లాంటి వస్తువులు విద్యా సంవత్సరం మొత్తానికి సరిపోయే విధంగా ప్రభుత్వమే అందించే పథకమే
జగనన్న విద్యా కానుక ..
గత ఏడాది ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పధకం ద్వారా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుకొనే ప్రతి విద్యార్థికి ఆ విద్యా సంవత్సరానికి అవసరమైన టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ , పెన్నులు ,పెన్సిల్స్ ఇతర స్టేషనరీతో పాటు మూడు జతల యూనిఫార్మ్ క్లాత్ , బెల్ట్స్ , షూస్ అందించి యూనిఫార్మ్ స్ట్రిచింగ్ కి అవసరమైన మొత్తం కూడా ప్రభుత్వమే విద్యార్థుల తల్లిదండ్రులకు అందించింది .
ఇందుకోసం గత విద్యా సంవత్సరంలో 648.10 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రతి విద్యార్థికీ డిక్షనరీ కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది . ఇందుకు అనుగుణంగా పెరిగిన విద్యార్థుల సంఖ్యని , డిక్షనరీల సేకరణకు అయ్యే అదనపు వ్యయాన్ని పరిగణించి 2020-21 కన్నా అదనంగా 83.2 కోట్లు ఇస్తూ మొత్తం 731.30 కోట్లకి విద్యాశాఖకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం .
ఈ నిర్ణయం ద్వారా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యని అభ్యసిస్తున్న నలభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ది కలగనుంది …