iDreamPost
android-app
ios-app

ధర్మాడి సత్యానికి వైఎస్సార్ లైఫ్ టైం అవార్డు

  • Published Oct 31, 2019 | 11:46 AM Updated Updated Oct 31, 2019 | 11:46 AM
ధర్మాడి సత్యానికి వైఎస్సార్ లైఫ్ టైం అవార్డు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతన్ని విశేష పురస్కారంతో సత్కరించేందుకు సిద్ధమైంది. ధర్మాడి సత్యంకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గురువారం తెలిపారు. బోటు ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవాల్వని సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.