iDreamPost
android-app
ios-app

డేత్తడి హారిక.. హాటెస్ట్‌ ‘బిగ్‌’ కంటెస్టెంట్‌.!

డేత్తడి హారిక.. హాటెస్ట్‌ ‘బిగ్‌’ కంటెస్టెంట్‌.!

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో నాలుగో సీజన్‌లో హాటెస్ట్‌ కంటెస్టెంట్‌ ఎవరు.? అన్న ప్రశ్నకు సమాధానాలు చాలానే వున్నాయి. హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌తోపాటు, యూ ట్యూబ్‌ సెన్సేషన్స్‌ అలేఖ్య హారిక, దివి, అరియానా గ్లోరీ పేర్లు గ్లామర్‌ పరంగా గట్టిగా వినిపస్తున్న సంగతి తెల్సిందే. కాగా, ఈ నలుగురిలో ‘బ్యాక్‌ ఎండ్‌ సపోర్ట్‌’ చాలా స్ట్రాంగ్‌గా వున్నది మాత్రం అలేఖ్య హారిక అలియాస్‌ డేత్తడి హారికకేనట. ఆమె పేరిప్పుడు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. ‘డేత్తడి హారిక ఆర్మీ’, ‘డేత్తడి హారిక సోల్జర్స్‌’ అంటూ పలు హ్యాష్‌ ట్యాగ్‌లతో ఆమెకు సపోర్ట్‌ చేస్తున్నారు. అరియానా గ్లోరీ, దివి, మోనాల్‌ గజ్జర్‌ పేర్లు కూడా గట్టిగానే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సీజన్‌ వన్‌, సీజన్‌ టూ, సీజన్‌ త్రీతో పోల్చి చూస్తే.. సీజన్‌ ఫోర్‌ చాలా హాట్‌గా వుంటుందనీ, దానిక్కారణం.. ఈసారి కంటెస్టెంట్స్‌లో హాట్‌ అప్పీల్‌ చాలా ఎక్కువనీ చర్చించుకుంటున్నారు. అయితే, ఇంకా ఫస్ట్‌ డే బిగ్‌ హౌస్‌ రాజకీయాలు చూడకుండా, అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేయలేం. బిగ్‌ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు. ‘ఇది ఏమాత్రం స్క్రిప్ట్‌ ప్రకారం జరిగేది కాదు’ అని హోస్ట్‌ నాగార్జున పదే పదే చెబుతున్నా, తెరవెనుకాల జరిగే వ్యవహారం వేరేలా వుంటోంది. గత సీజన్లలో ఇదే చూశాం. అంచనాలు తల్లకిందులైపోవడం, డల్‌ క్యాండిడేట్స్‌ అనూహ్యంగా పుంజుకుని, యాక్టివ్‌ కంటెస్టెంట్స్‌ డీలా పడిపోవడం గతంలో చూసిన దరిమిలా, ఈసారి ఎవరు హాటెస్ట్‌ అనేది చెప్పడం కష్టమే. ఇప్పుడున్న ఈక్వేషన్స్‌ని బట్టి చూస్తే హారికకి ఎడ్జ్‌ వుంది. పైగా, ఆమెకి మెగా ఫ్యాన్స్‌తోపాటు, ఇతర హీరోల అభిమానుల మద్దతు కూడా బాగా లభిస్తోంది.

Bigg Boss Telugu 4 Contestants @ https://bit.ly/3h6QEhE