iDreamPost
android-app
ios-app

12 లైన్స్ హైవే ఎక్కడుందో తెలుసా?

12 లైన్స్ హైవే ఎక్కడుందో తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబై వరకు అత్యంత పొడవైన ఎక్సె ప్రెస్ వే ను నిర్మిస్తున్నారు. 12 వరుసలుగా నిర్మించే ఈ ఎక్స్ ప్రెస్ వే రెండేళ్లలో పూర్తి కానుంది. అయితే ప్రస్తుతానికి 8 లైన్స్ వేగా నిర్మించి, ట్రాఫిక్ రద్దీని బట్టీ 12 లైన్స్ కు విస్తరించేలా పనులు జరుగుతున్నాయి.

ప్రపంచంలోని అత్యంత పొడవైన ఎక్స్ ప్రెస్ వే గా ఇది రికార్డుల కెక్కనుంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు 1380 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ జాతీయ రహదారి కోసం సుమారు లక్షకోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం కారు ప్రయాణానికి ఢిల్లీ నుంచి ముంబై వరకు 24 గంటల సమయం పడుతుండగా, ఈ వే అందుబాటులోకి వస్తే 12గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు. ట్రక్ ద్వారా అయితే 20 గంటలు పడుతుంది.

ఐదు రాష్ట్రాల్లో నుంచి …

ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల గుండా ఎక్స్ ప్రెస్ వే వెళుతుంది. 98 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 2013 మార్చి 23 నాటికి పూర్తి చేసేలా నిర్మాణం జరుగుతోంది. ఇందులో మొదటి ఫేజ్ అంటే ఢిల్లీ నుంచి వడదోర వరకు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి రానుంది. 2019 మార్చి 9న ఈ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు.

ఆర్థికకేంద్రాల అనుసంధానం..

జెవార్ ఎయిర్ పోర్టు నుంచి జవహరలాల్ పోర్టు వరకు నిర్మిస్తున్న ఈ రోడ్డు మార్గం కోసం 15 వేల హైక్టార్ల భూమిని సేకరించారు. జైపూర్, కిషన్ గఢ్, అజ్మీర్కోట, చిత్తోర్గఢ్, ఉదయ్ పూర్, భోపాల్, ఉజ్జియి, ఇండోర్, అహ్మాదాబాద్, వడదోర, సూరత్ వంటి ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తుంది. 

Also Read : టీడీపీ గోపవరంలో గెలిస్తే బద్వేల్లో కూడా గెలుస్తుందా?

అత్యంత అధునాతన సౌకర్యాలు..

ప్రస్తుతానికి 8 వరుసలుగా నిర్మిస్తున్న ఈ మార్గాన్ని అవసరమైతే 12 లైన్ గా మార్చేందుకు అనువుగా ప్లాన్ చేశారు. అందుకు అవసరమైన స్థలాన్ని మధ్యలో వదలి గ్రీనరీ పెంచుతున్నారు. రహదారి పక్కనే మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరుస్తున్నారు. రిసార్టులు, రెస్టారెంటులు, ఫ్యూయల్ స్టేషన్స్ నిర్మిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి రక్షించేందుకు ఎయిర్ అంబులెన్స్ వ్యవస్థను ఉపయోగించనున్నారు.

అలాగే మార్గం వెంబడి 20 లక్షల మొక్కలను నాటి పచ్చదనం పెంచనున్నారు. అలాగే అటవీప్రాంతం గుండా ఈ ఎక్స్ ప్రెస్ వే వెళుతున్నందున జంతువుల కదలికలకు అంతరాయం లేకుండా ఓవర్ పాస్ లు నిర్మిస్తున్నారు.

ఎక్సె ప్రెస్ వే నిర్మాణం కోసం 12 లక్షల టన్నుల ఇనుము వినియోగించనున్నారు. ఇది 50 హౌరా బ్రిడ్జిల నిర్మాణానికి సమానమని నిపుణులు చెబుతున్నారు. 80 లక్షల టన్నుల సిమెంట్ ను వాడుతుండగా మార్గం నిర్మాణంతో వేలమంది సివిల్ ఇంజినీర్లకు ఉపాధి లభిస్తుంది. దాదాపు 50 లక్షల పనిదినాలు అవసరమవుతాయని అంచనా వేశారు.

హర్యానా లో 160 కిలోమీటర్ల పొడువునా రోడ్డు నిర్మాణం జరుగుతుండగా, రాజస్తాన్ లో 374 కిలోమీటర్ల పొడవునా హైవే వెళుతుంది. మధ్యప్రదేశ్ లో 250 కిలోమీటర్లు వెళుతుంది. ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో గుజరాత్ లో 60 వంతెనలు, 17 ఇంటర్ ఛేంజులు, 17 ఫ్లై ఓవర్లు, 8 ఆర్వోబీలు నిర్మిస్తున్నారు.

రహదారి నిర్మాణానికి గానూ మార్కెట్ రేటు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ చెల్లించి భూమిని సేకరించినట్లు కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. దాదాపు 20 కన్ స్ట్రక్షన్ సంస్థలు కాంట్రాక్టు పొందగా.. పర్యావరణానికి నష్టం లేకుండా అత్యంత పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు.

Also Read : విలక్షణ నేత చిత్తూర్ మాజీ ఎంపీ శివప్రసాద్‌