Swetha
ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎలాంటి సౌండ్ లేదు. అసలు ఈ సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు కదుల్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎలాంటి సౌండ్ లేదు. అసలు ఈ సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు కదుల్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Swetha
ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎలాంటి సౌండ్ లేదు. అసలు ఈ సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు కదుల్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం ఎనిమిది సినిమాలలో కనీసంఒక్కటి కూడా బజ్ లేకపోవడం గమనార్హం. అసలు ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తాయా అనే కంటే ముందు ఏ ఏ సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలైనా ప్రమోషన్స్ లేనిది నడవదు. అలాంటిది ఈ వారం వచ్చే సినిమాలకు సరైన ప్రమోషన్స్ కూడా లేదనిపిస్తుంది. అయితే టాక్ బయటకు వచ్చే వరకు ఏ సినిమాను కొట్టి పారేయలేము. అంతకముందు వారం వచ్చిన చిన్న సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకున్నాయి తెలియనిది కాదు. అసలు ఈ వారం థియేటర్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నుంచి వస్తున్న ‘భద్రకాళి’ మూవీ. “ఒకే షాట్” అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు’ అనే మూవీ. అసలు ఇలాంటి మూవీ ఒకటి రిలీజ్ అవుతున్నట్లు కూడా ఎవరికీ తెలియకపోవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అలాగే తమిళ్ లో సూపర్ హిట్ మూవీ ‘టన్నెల్’ తెలుగులో రిలీజ్ కాబోతుంది. యాక్షన్ డ్రామా రొమాంటిక్ జోనర్ లో జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో బ్యూటీ అనే సినిమా రాబోతుంది. ఈ చిత్రాలతో పాటు కర్మణ్యే వాధికారస్తే, వీర చంద్రహాస్, రక్ష, మిస్టర్ సోల్జర్ లాంటి సినిమాలు ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానున్నాయి. ఇక వీటిలో ఏది ఎలాంటి టాక్ సంపాదించుకుంటుంది అనేది చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.