iDreamPost
android-app
ios-app

కాంతార సైలెన్స్ ను ఎలా అర్ధం చేసుకోవాలి

  • Published Sep 19, 2025 | 1:48 PM Updated Updated Sep 19, 2025 | 1:48 PM

సరే మొదటి పార్ట్ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చి.. రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు సినిమాకు చాలా బజ్ ఉంది. అలాగే సినిమా మీద చాలా హోప్స్ కూడా ఉన్నాయి. సో కాంతారా టీం బయటకు వచ్చి సినిమా గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతారేమో అని.. అంతా ఎదురుచూస్తున్నారు.

సరే మొదటి పార్ట్ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చి.. రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు సినిమాకు చాలా బజ్ ఉంది. అలాగే సినిమా మీద చాలా హోప్స్ కూడా ఉన్నాయి. సో కాంతారా టీం బయటకు వచ్చి సినిమా గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతారేమో అని.. అంతా ఎదురుచూస్తున్నారు.

  • Published Sep 19, 2025 | 1:48 PMUpdated Sep 19, 2025 | 1:48 PM
కాంతార సైలెన్స్ ను ఎలా అర్ధం చేసుకోవాలి

సరే మొదటి పార్ట్ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చి.. రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు సినిమాకు చాలా బజ్ ఉంది. అలాగే సినిమా మీద చాలా హోప్స్ కూడా ఉన్నాయి. సో కాంతారా టీం బయటకు వచ్చి సినిమా గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతారేమో అని.. అంతా ఎదురుచూస్తున్నారు. కాంతారా 2 సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కానుంది. రిలీజ్ కు చాలా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ టీం నుంచి మాత్రం ఎలాంటి హడావిడి లేదు.

అలాగే ఇంకో సైడ్ టికెట్ రేట్ల విషయం గురించి పంచాయితీ జరుగుతుంది. వచ్చే వారం ఈ విషయంలో తీర్పు రానుంది. ఎలాంటి తీర్పు వస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. సరే దీని గురించి పక్కన పెడితే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా.. కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తుందనే నమ్మకం టీం కు ఉందట. సరే కంటెంట్ ను నమ్మి ఇలా ఉండడంలో తప్పు లేదు కానీ.. దీనికంటే ముందు ఓజి సినిమా వస్తుంది. దానికి విపరీతమైన హైప్ ఉంది. అదంతా తెలిసి కూడా కాంతారా టీం సైలెంట్ గా ఎందుకు ఉందొ ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఈ సోమవారం కాంతారా 2 ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట. సో దాని మీదే హైప్ ఆధారపడి ఉంది. అప్పటికైనా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా లేదాఅనేది చూడాలి. పైగా కాంతారాకు ఓజి ఒక్కటే కాంపిటీషన్ కాదు.. తమిళం నుంచి ధనుష్ ఇడ్లి , కడాయి సినిమా కూడా ఉంది. ఈ సినిమాను తక్కువ అంచనా వేయకూడదు. ఇలా ఎటు చూసినా వార్ టఫ్ గానే ఉంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇలా మౌనంగా ఉన్నాము అంటే.. రిస్క్ తప్పేలా లేదు. ఒకవేళ ఇవన్నీ క్రాస్ చేసి ప్రీవియస్ దానిలా హిట్ అందుకుంటే మాత్రం ఈ మాటలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.