iDreamPost
android-app
ios-app

OTTలో లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్ పై క్లారిటీ

  • Published Sep 20, 2025 | 11:05 AM Updated Updated Sep 20, 2025 | 11:05 AM

ఇటీవల కాలంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు అందుకున్న సిమిమా ఏమైనా ఉందంటే అది లిటిల్ హార్ట్స్ సినిమానే. రిలీజ్ ముందు వరకు కూడా ఎలాంటి హైప్ లేని ఈ సినిమాకు. మొదటి షో తర్వాత మౌత్ పబ్లిసిటీ విపరీతంగా పెరిగిపోయింది

  • Published Sep 20, 2025 | 11:05 AMUpdated Sep 20, 2025 | 11:05 AM
OTTలో లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్ పై క్లారిటీ

ఇటీవల కాలంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు అందుకున్న సిమిమా ఏమైనా ఉందంటే అది లిటిల్ హార్ట్స్ సినిమానే. రిలీజ్ ముందు వరకు కూడా ఎలాంటి హైప్ లేని ఈ సినిమాకు. మొదటి షో తర్వాత మౌత్ పబ్లిసిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత రెండు పెద్ద సినిమాలు వచ్చిన కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ మాత్రం కాస్త స్టేబుల్ గానే ఉంది. లిటిల్ హార్ట్స్ సినిమా ఈటీవీ విన్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. సో ఆటోమాటిక్ గా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ ఇదే.

ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయినా సాధారణంగా 28 రోజులకు ఓటిటి ఎంట్రీ ఇచ్చేస్తుంది. సో లిటిల్ హార్ట్స్ కూడా ఓ రెండు వారాల్లో ఓటిటి ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ వార్తలపై ఈటీవీ విన్ క్లారిటీ ఇచ్చింది. థియటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రాన్నీ ఇప్పట్లో ఓటిటి స్ట్రీమింగ్ కు తీసుకురామని తేల్చి చెప్పేసింది. థియేట్రికల్ రన్ పూర్తిగా అయ్యాక తామే ఓ డేట్ చెప్తామని చెప్పింది. సో ఇప్పట్లో లిటిల్ హార్ట్స్ ఓటిటి స్ట్రీమింగ్ లేనట్టే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.