iDreamPost
android-app
ios-app

సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో 6 సినిమాలు

  • Published Sep 19, 2025 | 3:32 PM Updated Updated Sep 19, 2025 | 3:32 PM

సుకుమార్ ఇండస్ట్రీకి ఎలాంటి కథలను అందిస్తున్నాడో తెలియనిది కాదు. పుష్ప 2 సక్సెస్ తో సుకుమార్ రేంజ్ ఇంకాస్త పెరిగింది. అయితే సుకుమార్ లో ఓ మంచి క్వాలిటీ ఉంది. ఎంత ఎదిగినా కూడా తన రూట్స్ ను మర్చిపోడు. తనతో కలిసి పనిచేసి వారిని తన శిష్యులను కూడా ఆయన ఎప్పుడు వదలరు

సుకుమార్ ఇండస్ట్రీకి ఎలాంటి కథలను అందిస్తున్నాడో తెలియనిది కాదు. పుష్ప 2 సక్సెస్ తో సుకుమార్ రేంజ్ ఇంకాస్త పెరిగింది. అయితే సుకుమార్ లో ఓ మంచి క్వాలిటీ ఉంది. ఎంత ఎదిగినా కూడా తన రూట్స్ ను మర్చిపోడు. తనతో కలిసి పనిచేసి వారిని తన శిష్యులను కూడా ఆయన ఎప్పుడు వదలరు

  • Published Sep 19, 2025 | 3:32 PMUpdated Sep 19, 2025 | 3:32 PM
సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో 6 సినిమాలు

సుకుమార్ ఇండస్ట్రీకి ఎలాంటి కథలను అందిస్తున్నాడో తెలియనిది కాదు. పుష్ప 2 సక్సెస్ తో సుకుమార్ రేంజ్ ఇంకాస్త పెరిగింది. అయితే సుకుమార్ లో ఓ మంచి క్వాలిటీ ఉంది. ఎంత ఎదిగినా కూడా తన రూట్స్ ను మర్చిపోడు. తనతో కలిసి పనిచేసి వారిని తన శిష్యులను కూడా ఆయన ఎప్పుడు వదలరు. తానూ ఎదుగుతూనే మిగిలిన వాళ్లకు కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు సుకుమార్. అలా స్టార్ట్ చేసిందే సుకుమార్ రైటింగ్స్. దీని నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకున్నాయి.

గత పదేళ్లుగా ఈ సంస్థ నుంచి చాలానే మంచి సినిమాలు వచ్చాయి. కుమారి 21 ఎఫ్ లాంటి యూత్ సినిమాల నుంచి గాంధీ తాత చెట్టు లాంటి సామజిక అంశాలను తెలియజేసే సినిమాల వరకు చాలానే సినిమాలు వచ్చాయి. ఇలా రాబోయే ఐదేళ్లల్లో ఎలాంటి సినిమాలు తీయాలో కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయట. 2025-2026 మధ్యలో సుకుమార్ రైటింగ్స్ నుంచి ఏకంగా 6 సినిమాలు లైన్ లో ఉన్నాయట. వీరంతా కూడా సుకుమార్ శిష్యులే. ఒకవేళ సుకుమార్ దగ్గర పనిచేయకపోయినా.. కథ నచ్చిందంటే సుకుమార్ తన బ్యానర్ లో అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అందుకే సుకుమార్ బ్యానర్ నుంచి ఇన్ని సినిమాలు వస్తున్నాయి.

అలాగే మార్కెట్ లో క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలు కూడా సుకుమార్ రైటింగ్స్ తో టైఅప్ అయ్యి.. కొత్త సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాయట . ఇవి మాత్రమే కాకుండా నెట్ ఫ్లిక్స్ సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో కూడా చాలానే సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలతో టాలెంటెడ్ పీపుల్ కి అవకాశాలు ఇవ్వనున్నట్లు డిసైడ్ అయ్యారట. ఓ డైరెక్టర్ నుంచి ఇంత మంది కొత్త వాళ్ళు రావడం.. వాళ్లంతా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండడం.. బహుశా సుకుమార్ వలెనే సాధ్యమేమో. త్వ‌ర‌లో సుకుమార్ రైటింగ్స్ నుంచి ఏ ఏ సినిమాలు రానున్నాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.