iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో ఇంట్రెస్గింగ్ సినిమాలు , సిరీస్ లు ఇవే

  • Published Sep 19, 2025 | 1:21 PM Updated Updated Sep 19, 2025 | 1:21 PM

శుక్రవారం అంటే ప్రేక్షకులు అంతా ఎదురుచూసేది సినిమాల కోసమే. కానీ ఈ వారం మాత్రం థియేటర్లో అసలు చెప్పొదగిన సినిమాలు ఏమి లేవు. పైగా కొన్ని సినిమాలు అసలు వస్తున్నాయన్న సంగతి కూడా తెలీదు. మిగిలింది గత వారం రిలీజ్ అయిన మిరాయ్ , కిష్కింధపురి , లిటిల్ హార్ట్స్ సినిమాలే. అవి కాకుండా ఓటిటి లో కొన్ని సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇక వాటిలో ఇంట్రెస్టింగ్ గా ఉండే సినిమాలు , సిరీస్ లు ఇవే

  • Published Sep 19, 2025 | 1:21 PMUpdated Sep 19, 2025 | 1:21 PM
ఈ వారం OTT లో ఇంట్రెస్గింగ్ సినిమాలు , సిరీస్ లు ఇవే

శుక్రవారం అంటే ప్రేక్షకులు అంతా ఎదురుచూసేది సినిమాల కోసమే. కానీ ఈ వారం మాత్రం థియేటర్లో అసలు చెప్పొదగిన సినిమాలు ఏమి లేవు. పైగా కొన్ని సినిమాలు అసలు వస్తున్నాయన్న సంగతి కూడా తెలీదు. మిగిలింది గత వారం రిలీజ్ అయిన మిరాయ్ , కిష్కింధపురి , లిటిల్ హార్ట్స్ సినిమాలే. అవి కాకుండా ఓటిటి లో కొన్ని సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇక వాటిలో ఇంట్రెస్టింగ్ గా ఉండే సినిమాలు , సిరీస్ లు ఇవే

మహావతార్ నరసింహ.. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఓటీటీ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ లోని ఓ చీకటి కోణాన్ని .. తన పర్సనల్ లైఫ్ లో పడిన ఓ అంశాన్ని కాస్త సెటైరికల్ వే లో చూపించాడు.

ఇక వీటితోపాటు విలేజ్ లవ్ స్టోరీ కన్యాకుమారి.. ఆహ , అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవన్నీ ఒకటైతే ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం శ్రీ విష్ణు, శ్రీ ముఖి, హర్ష వర్థన్ రాణే, రీతూ వర్మ, వితిక నటించినప్రేమ ఇష్క్ కాదల్ ఇప్పుడు ఓటిటి బాట పట్టింది. ఈ సినిమా ఇప్పుడు ఈటివి విన్ లో ప్రసారం అవుతుంది. అలాగే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ రర్ యాక్షన్ థ్రిల్లర్స్ బ్లాక్ రాబిట్, సిన్నర్స్ కూడా ఓటిటి లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.