iDreamPost
android-app
ios-app

లిటిల్ హార్ట్స్ బాగా ప్లాన్ చేసిందిగా

  • Published Sep 19, 2025 | 12:00 PM Updated Updated Sep 19, 2025 | 12:00 PM

చిన్న సినిమాలు పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తున్నాయని ఈ మధ్య కాలంలో చాలానే సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చేసింది కూడా ఇదే. ఈ సినిమా వచ్చిన వారానికి మిరాయ్ లాంటి మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా వచ్చినా సరే ఈ సినిమా మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. సక్సెస్ మీట్లు ప్రమోషన్స్ అంటూ ఎదో రకంగా మీడియా , సోషల్ మీడియాలో సౌండ్ చేస్తూనే ఉంది

చిన్న సినిమాలు పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తున్నాయని ఈ మధ్య కాలంలో చాలానే సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చేసింది కూడా ఇదే. ఈ సినిమా వచ్చిన వారానికి మిరాయ్ లాంటి మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా వచ్చినా సరే ఈ సినిమా మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. సక్సెస్ మీట్లు ప్రమోషన్స్ అంటూ ఎదో రకంగా మీడియా , సోషల్ మీడియాలో సౌండ్ చేస్తూనే ఉంది

  • Published Sep 19, 2025 | 12:00 PMUpdated Sep 19, 2025 | 12:00 PM
లిటిల్ హార్ట్స్ బాగా ప్లాన్ చేసిందిగా

చిన్న సినిమాలు పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తున్నాయని ఈ మధ్య కాలంలో చాలానే సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చేసింది కూడా ఇదే. ఈ సినిమా వచ్చిన వారానికి మిరాయ్ లాంటి మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా వచ్చినా సరే ఈ సినిమా మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. సక్సెస్ మీట్లు ప్రమోషన్స్ అంటూ ఎదో రకంగా మీడియా , సోషల్ మీడియాలో సౌండ్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఇంకో సక్సెస్ మీట్ జరిగింది. దీనికి అల్లు అరవింద్ , విజయ్ దేవరకొండ గెస్ట్ లు గా వచ్చారు. అలాగే బండ్ల గణేష్ కూడా అటెండ్ అయ్యాడు. ఎప్పటిలానే మరోసారి బండ్ల గణేష్ స్పీచ్ బాగా హైలెట్ అయింది.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అందుకుంటున్న మౌళికి.. ఇండస్ట్రీ గురించి హితబోధని చేసాడు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక దీనికి కొద్దీ రోజుల ముందు జరిగిన ఈవెంట్ లో అడవి శేష్ గెస్ట్ గా వచ్చాడు. ఆ ఈవెంట్ లో అడవి శేష్ చేసిన సందడి ఇంకా అందరికి అలానే మైండ్ లో ఫ్రెష్ గా ఉంది. ఇక దర్శక నిర్మాతలు ఇచ్చిన ఇంటర్వూస్ హీరోల వరకు చేరి.. రివ్యూలు వస్తున్నాయి. ఇలా ఎదో విధంగా నిత్యం జనాల నోళ్ళలో నానుతూనే ఉంది. ఈ మాత్రం మౌత్ పబ్లిసిటీ ఉంటె ఏ సినిమాకైనా హిట్ పడకుండా ఎలా ఉంటుంది.

ఇక ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కి కేవలం వారం రోజుల సమయమే ఉంది. ఓజి వచ్చిన తర్వాత ఆటొమ్యాటిక్ గా లిటిల్ హార్ట్స్ రేస్ నుంచి తప్పుకోవాల్సిందే. ఇటు ఎలాగూ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఉండనే ఉంది. కాబట్టి నాలుగు వారలా థియేట్రికల్ రన్ సరిపోతుంది. ఇలా చూసుకున్నా చిన్న సినిమా అనుకున్న దానికంటే నాలుగింతలు ఎక్కువ వసూళ్లే వచ్చాయి. సో ఓ పద్దతి ఓ ప్లానింగ్ అంటూ లిటిల్ హార్ట్స్ దూసుకుపోతుంది. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.