iDreamPost
android-app
ios-app

మహావతార్ నరసింహ మరో పాఠం

  • Published Sep 19, 2025 | 10:20 AM Updated Updated Sep 19, 2025 | 10:20 AM

సినిమాల రిలీజ్ డేట్స్ ను ఓటిటి లు శాసిస్తున్న రోజులు ఇవి. సినిమా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో ఓటిటిలు డీల్స్ మాట్లాడుకోవడం. రిలీజ్ తర్వాత సరిగ్గా నెల రోజులకు ఓటిటిలో స్ట్రీమింగ్ కావడం. ఇదంతా గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది.ఇక కొన్ని సినిమాలైతే థియేటర్లో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటిటిలో దర్శనం ఇస్తున్నాయి.

సినిమాల రిలీజ్ డేట్స్ ను ఓటిటి లు శాసిస్తున్న రోజులు ఇవి. సినిమా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో ఓటిటిలు డీల్స్ మాట్లాడుకోవడం. రిలీజ్ తర్వాత సరిగ్గా నెల రోజులకు ఓటిటిలో స్ట్రీమింగ్ కావడం. ఇదంతా గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది.ఇక కొన్ని సినిమాలైతే థియేటర్లో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటిటిలో దర్శనం ఇస్తున్నాయి.

  • Published Sep 19, 2025 | 10:20 AMUpdated Sep 19, 2025 | 10:20 AM
మహావతార్ నరసింహ మరో పాఠం

సినిమాల రిలీజ్ డేట్స్ ను ఓటిటి లు శాసిస్తున్న రోజులు ఇవి. సినిమా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో ఓటిటిలు డీల్స్ మాట్లాడుకోవడం. రిలీజ్ తర్వాత సరిగ్గా నెల రోజులకు ఓటిటిలో స్ట్రీమింగ్ కావడం. ఇదంతా గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ఇక కొన్ని సినిమాలైతే థియేటర్లో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటిటిలో దర్శనం ఇస్తున్నాయి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఈ రూల్ పాటించాల్సిందే. అయితే ఇప్పుడు మహావతాహార్ నరసింహ మాత్రం దీనికి చెక్ పెట్టింది. నిజానికి థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమా మీద అన్ని అంచనాలు లేవు.

కానీ ఓ వారం దాటినా తర్వాత దీనికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. చాలా కాలం తర్వాత మొదటి వీకెండ్ కాకుండా ఆ తర్వాత వీకెండ్స్ , వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ అయినా సినిమా ఇది. 56 రోజులు దాటుతున్నా సరే ఇంకా మెయిన్ సెంటర్స్ లో ఈ మూవీ ఆడుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ కి రెడీ అయింది. నిజానికి సినిమా రిలీజ్ కు ముందు ఈ మూవీ ఓటిటి డీల్ జరగలేదు. రీసెంట్ గానే ఓటిటి డీల్ ఫినిష్ చేసుకుంది. ఇక్కడ కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఒక్క రోజు ముందు ఓటిటి లోకి వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటె ఓటిటి డీల్ లేట్ అయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. లేదంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు ఓటిటి ల చేతిలో తోలు బొమ్మలు అయిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం మహావతారా నరసింహ అటు థియేటర్స్ లో ఎంత సందడి చేసిందో.. ఇకపై ఓటిటి లో కూడా అంతే సందడి చేయనుందని తెలుస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.