Swetha
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకి రసవత్తరంగా కొనసాగుతుంది. గత వారం నాగ్ ఇచ్చిన క్లాస్ కు ఈ వారం కంటెస్టెంట్స్ లో కాస్త మార్పు అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వారం నామినేషన్స్ లో కూడా చాలానే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత కెప్టెన్సీ కోసం కొన్ని టాస్క్ లు జరిగాయి.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకి రసవత్తరంగా కొనసాగుతుంది. గత వారం నాగ్ ఇచ్చిన క్లాస్ కు ఈ వారం కంటెస్టెంట్స్ లో కాస్త మార్పు అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వారం నామినేషన్స్ లో కూడా చాలానే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత కెప్టెన్సీ కోసం కొన్ని టాస్క్ లు జరిగాయి.
Swetha
బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకి రసవత్తరంగా కొనసాగుతుంది. గత వారం నాగ్ ఇచ్చిన క్లాస్ కు ఈ వారం కంటెస్టెంట్స్ లో కాస్త మార్పు అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వారం నామినేషన్స్ లో కూడా చాలానే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత కెప్టెన్సీ కోసం కొన్ని టాస్క్ లు జరిగాయి. అవి మరీ అంత టఫ్ టాస్క్ లు ల అయితే కనిపించడం లేదు. దీనిలో ఈ వారం డిమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. దానికి కారణం రీతూ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కెప్టెన్సీ కంటెండర్లని ఎంచుకోడానికి ముందే.. రీతూకి డిమోన్ పవన్ కి మధ్య ఓ డిస్కషన్ జరిగింది. నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలని రీతూ కోరడం.. నీకోసం ట్రై చేస్తా అని డిమాన్ పవన్ కళ్లలోకి కళ్లు పెట్టి మాటివ్వడం జరిగింది. ఇదంతా బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాడు కదా.. కావాలని పెట్టాడో ఏమో తెలీదు కానీ ఆ కెప్టెన్సీ టాస్క్ కు రీతూనే సంచలక్ గా చేసాడు. ఇక ఆట మొదలైనప్పటినుంచి రీతూ సపోర్ట్ పవన్ కె ఉన్నట్టు కనిపిస్తుంది. మొదటి రౌండ్‌లో మనీష్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్‌లో భరణి, ఇమ్మూ కలిసి డిమాన్‌ను టార్గెట్ చేశారు. దీంతో కామనర్స్.. కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లే టాస్క్ జరుగుతోంది.
ఇక్కడ డిమోన్ అవుట్ అవ్వాల్సి ఉంది. కానీ తాను ఆపమన్నా సరే, భరణి మూడుసార్లు పక్కవాళ్లపై రంగు పూశాడంటూ అతడిని గేమ్ నుంచి తీసేసింది. దీనితో లాస్ట్ వరకు ఇమ్మాన్యుయేల్ , డిమోన్ పవన్ మిగిలారు. డిమోన్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. చూస్తున్న ఆడియన్స్ అంతా రీతూ దగ్గరుండి డిమోన్ ను గెలిపించిందని అనుకుంటున్నారు. మరీ అంత ఎంటర్టైనింగ్ అయితే ఆడియన్స్ ఫీల్ అవ్వడం లేదు. ఎప్పుడెపుడూ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయా అని ఎదురుచూస్తున్నారు. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.