iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : షాకింగ్ అప్డేట్ కల్కి 2 నుంచి దీపికా అవుట్

  • Published Sep 18, 2025 | 12:46 PM Updated Updated Sep 18, 2025 | 12:46 PM

గత ఏడాది వచ్చిన సినిమాలలో రికార్డుల మోత మోగించిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో తెలియనిది కాదు. మరిచిపోయిన పురాణాలను ఒక్కసారి తిరిగి గుర్తుచేసుకునేలా చేసింది. ఇక ఈ మూవీ సిక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

గత ఏడాది వచ్చిన సినిమాలలో రికార్డుల మోత మోగించిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో తెలియనిది కాదు. మరిచిపోయిన పురాణాలను ఒక్కసారి తిరిగి గుర్తుచేసుకునేలా చేసింది. ఇక ఈ మూవీ సిక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

  • Published Sep 18, 2025 | 12:46 PMUpdated Sep 18, 2025 | 12:46 PM
అఫీషియల్ : షాకింగ్ అప్డేట్ కల్కి 2 నుంచి దీపికా అవుట్

గత ఏడాది వచ్చిన సినిమాలలో రికార్డుల మోత మోగించిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో తెలియనిది కాదు. మరిచిపోయిన పురాణాలను ఒక్కసారి తిరిగి గుర్తుచేసుకునేలా చేసింది. ఇక ఈ మూవీ సిక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అటు ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న సినిమాల సంగతి తెలియనిది కాదు. సో ఈ సిక్వెల్ మీద ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. కానీ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది.

ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో దీపికా పదుకునే మెయిన్. అయితే కల్కి 2 లో దీపికా పదుకునే ఉండదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అఫీషియల్ గా చెప్పేసింది. తనతో డీల్ కుదరకపోవడం వలెనే ప్రాజెక్ట్ నుంచి ఆమె బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందని. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న పాత్రకు తగిన హీరోయిన్ ను చూస్తామని చెప్పుకొచ్చింది. అసలు కారణాలు ఏంటి అనేది అధికారికంగా బయటకు రాలేదు. కానీ అన్అఫీషియల్ గాసిప్స్ అయితే బాగానే నడుస్తున్నాయి. ఆల్రెడీ గతంలో కూడా ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హైలెట్ అయింది.

ఇక ఇప్పుడు కల్కి పార్ట్ 2 లో దీపికా ప్లేస్ లో ఎవరు కనిపిస్తారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ ఏ. మృణాల్ ఆల్రెడీ మూవీలో ఓ క్యామియో చేసింది కాబట్టి ఆమెకు ఛాన్స్ లేదు. ఇక అనుష్క , ఐశ్వర్య , కాజల్ , రష్మిక , జాన్వీ కపూర్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక వీరిలో ఎవరినైనా తీసుకుంటారా లేదా ఇంకా ఎవరినైనా సెలెక్ట్ చేస్తారా అనేది చూడాలి. 2027 కంటే ముందైతే కల్కి లేనట్టే అనే అంటున్నారు. ఇక ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.