iDreamPost
android-app
ios-app

Rayalaseema Hakkula Vedika – ఆసక్తి రేపుతున్న రాయలసీమ వాసుల అభివృద్ధి వికేంద్రీకరణ సభ …

Rayalaseema Hakkula Vedika – ఆసక్తి రేపుతున్న రాయలసీమ వాసుల అభివృద్ధి వికేంద్రీకరణ సభ …

రాజకీయ పార్టీల ప్రమేయం , మద్దతు , సహకారం లేకుండా సీమ ప్రాంత సమస్యల పై నిత్యం గళం విప్పే రాయలసీమ మేధావుల ఫోరమ్ కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో మేధావులు , సాహితీవేత్తలు , ప్రజా సమస్యల పోరాట సంఘాల భాగస్వామ్యంతో జరగనున్న అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సభ పట్ల రాష్ట్ర వ్యాప్త ఆసక్తి .

నిన్న తిరుపతిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన అమరావతి సభలో సీమ ప్రాంత సమస్యల గురించి , సీమవాసుల ఆకాంక్షల గురించి ప్రస్తావన లేకపోవడంతో నిరుత్సాహపడ్డ సీమ ప్రజానీకం నేటి సభలో చర్చకు రానున్న అంశాలు , డిమాండ్ల పట్ల ఆశావహ దృక్పథం తో ఎదురుచూపు ..

వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు ఒప్పుకోము , అమరావతే ఏకైక రాజధాని అంటూ టీడీపీ రైతుల పేరిట ఆందోళనలు చేపట్టడం తెలిసిన విషయమే . నాటి నుండి అమరావతే రాజధానిగా ఉండాలని అన్ని రంగాల సంస్థలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని , అదే నిజమైన అభివృద్ధి , ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా అది అభివృద్ధి కాదంటూ ప్రచారం చేస్తూ నిత్యం ఏదోక రూపంలో నినాదాలు చేస్తూ వస్తున్నారు . ఒకానొక దశలో అమరావతి పోరాటానికి చుట్టుపక్కల దగ్గర్లోని ప్రాంతాల నుండి కూడా మద్దతు లేదని బాబు , అనుకూల మీడియా వాపోయారు .

Also Read :  మూడు రాజధానుల ఆకాంక్ష.. భారీ ర్యాలీతో బలంగా చాటిన తిరుపతి

ఈ నేపథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి ఏకైక రాజధాని అనే నినాదంతో గుంటూరు నుండి తిరుపతి వరకూ పాదయాత్ర చేసి నిన్న తిరుపతిలో బహిరంగ సభతో యాత్ర ముగించారు . అయితే యాత్ర యావత్తు ఇతర ప్రాంతాలలో , ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో అమరావతి ఆశలు , ఆకాంక్షలు భూముల ధరలు గురించి ప్రస్తావించారే కానీ ఆయా ప్రాంతాల ప్రజలలో ఉన్న అభివృద్ధి ఆకాంక్ష , తమ ప్రాంత సమస్యలు , అవి తీరే మార్గాల గురించిన ఊసే లేకపోవడం , అమరావతి డిజైన్ రూపకర్త , ఆందోళనలను వెనకుండి నడిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో సైతం రాయలసీమ వెనకబాటుతనాన్ని , అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా అమరావతి గురించి ఊదరగొట్టటంతో సీమ వాసులు ఒకింత అసహనానికి గురయ్యారు .

ఈ పరిణామాల నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ సాధన కోసం రాయలసీమ మేధావుల ఫోరమ్ కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో సీమ నుండి మాత్రమే కాక ఉత్తరాంధ్ర , విజయవాడ ప్రాంతాల నుండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి , రాయలసీమ కార్మిక , కర్షక సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి , ప్రముఖ రచయిత శాంతి నారాయణ , రాయలసీమ ఉద్యమ నాయకుడు శ్రీ భూమన్ , రాయలసీమ ఉద్యమ యువజన నాయకుడు సుధాకర్ కొత్తపల్లి , రాయలసీమ నీటి అధ్యయన వేదిక అధ్యక్షుడు శ్రీకంఠ జంబుల , ప్రముఖ న్యాయవాది శివారెడ్డి , ఉత్తరాంధ్ర పోరాట సమితి అధ్యక్షుడు రాజా గౌడ్ తదితరులు పాల్గొననున్నారని ప్రాథమిక సమాచారం. 

Also Read : మూడు రాజధానులకు మద్ధతుగా మంత్రి సీదిరి శంఖారావం

పలువురు మేధావులు , సాహితీ వేత్తలు ప్రసంగించనున్న ఈ సభలో రాయలసీమ హక్కులు , ఈ ప్రాంత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు , అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా సీమకు చెందాల్సిన అంశాల పట్ల లోతైన చర్చ , వాటి సాధనకు కార్యాచరణ ప్రణాళిక వంటి వాటి పట్ల సీమ వాసులు ఆశగా , ఆసక్తితో ఎదురుచూస్తున్నారు …