ఏపీపై అసని తుఫాన్ ఎఫెక్ట్ పడింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ బలహీన పడినట్లు, తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా మారిందని వెల్లడించారు. అయితే సిక్కోలు (శ్రీకాకుళం) లో తుఫాన్ దాటికి ఓ బంగారు రథం కొట్టుక రావడం హాట్ టాపిక్ అయ్యింది. సంత బొమ్మాళి మండలంలోని సున్నా రేవుకి ఇది కొట్టుకొచ్చింది. పూర్తిగా ఇది బంగారు వర్ణంలో ఉందని స్థానికులు అంటున్నారు. ఈ రథాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ రథంపై 16–01-2022 సంఖ్యలు ఏదో భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు రథాన్ని స్వాదీనం చేసుకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇంతకుముందు ఎన్నో తుఫానులు వచ్చినా ఇలాంటి ఘటన జరగలేదు. ఇంతకీ ఈ రథం ఎక్కడిది? విదేశాలదా? ఈ వార్త హల్ చల్ చెయ్యడమే కాదు, రథంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో గిర్రున తిరుగుతున్నాయి.
అసని తుఫాన్ విషయానికి వస్తే… ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ బంగాళా ఖాతంకు చేరుకొనే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.
74289