iDreamPost
iDreamPost
ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ బిజినెస్ డీల్స్ ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే తమిళ థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ ప్రైస్ కి లైకా సంస్థ సొంతం చేసుకోగా కన్నడ మళయాలం కూడా అతి త్వరలో ఫైనల్ కాబోతున్నాయి. ఇక తెలుగు సంగతి సరేసరి. బాహుబలికి ధీటుగా ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనే తరహాలో డిస్ట్రిబ్యూటర్లు హక్కుల కోసం పోటీ పడుతున్నారు. కొన్ని ఏరియాలు క్లోజ్ అయ్యాయని మరికొన్ని చివరి దశలో ఉన్నట్టుగా సమాచారం. 2021లో వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రిలీజ్ గా ఆర్ఆర్ఆర్ నిలవబోతోంది. నార్త్ లోనూ దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఎన్ని వందల కోట్లో లెక్క తేలడం ఇప్పట్లో చెప్పలేం.
ఇదిలా ఉండగా శాటిలైట్ హక్కుల కోసం సైతం ఊహించని స్థాయిలో ఛానల్స్ పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం స్టార్ నెట్ వర్క్ అధీనంలో నడిచే డిస్నీ హాట్ స్టార్ మొత్తం డిజిటల్ హక్కులను గంపగుత్తగా 200 కోట్లకు అడిగినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్టార్ అన్ని భాషలకు శాటిలైట్ కలుపుకుని అడిగింది. దీనికన్నా చాలా ఎక్కువ స్థాయిలో రీచ్ ఉన్న అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ఇంత మొత్తాన్ని ఆఫర్ చేయలేవు. అందులోనూ వాటికి విడిగా ఛానల్స్ అంటూ లేవు. కానీ స్టార్ కు ఇచ్చే విషయంలో దానయ్య తొందరపడటం లేదని తెలిసింది.
మొత్తం వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ అన్ని ఫార్మాట్స్ కలిపి సుమారు వెయ్యి కోట్లు టచ్ చేయవచ్చని ఒక అంచనా. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడం చాలా సులభం. అందులోనూ అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ కు ఎలాంటి పోటీ లేదు. హాలీవుడ్ నుంచి అనౌన్స్ మెంట్లు రాలేదు. సో ఎలా చూసుకున్నా ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూట్ క్లైమాక్స్ లో ఉంది. ఇది అయ్యాక మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేయబోతున్నారు. ఒలీవియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్లుగా నటించిన ఆర్ఆర్ఆర్ కు కీరవాణి సంగీతమందించగా సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చారు.