iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయిన వ్యాక్సినేషన్ ప్రకియ

  • Published Jan 16, 2021 | 6:59 AM Updated Updated Jan 16, 2021 | 6:59 AM
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయిన వ్యాక్సినేషన్ ప్రకియ

ప్రపంచాన్ని మహమ్మారిలా పట్టిపీడించిన కరోనా నుండి విముక్తి పొందేందుకు ప్రజలందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎట్టకేలకు దేశ వ్యాప్తంగా మొదలైంది. మొత్తం 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తునట్టు ప్రధాని మోడి ప్రకటించారు. దేశవ్యాప్తంగా తొలిదశ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవుడంతో పాటు తెలుగురాష్ట్రాల్లో కూడా టీకా ప్రక్రియ ప్రారంభం అయింది.

ఏపీలో తొలివిడతలో 3.87 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అందుకోసం 332 కేంద్రాలను కోవిడ్ టీకా పంపిణీ చేసేందుకు ఎంచుకున్నారు. మొదటగా ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. ఇందులో భాగంగా తోలి రోజు సీఎం జగన్ విజయవాడ జీజీహెచ్ లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా తొలి టీకాను హెల్త్ వర్కర్ పుష్పకుమారికి ఇవ్వగా రెండవ టీకాను హెల్త్ వర్కర్ నాగ జ్యోతికి, ఆ తరువాత హెల్త్ వర్కర్ జయకుమార్ కు అందించారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు.

ఇక తెలంగాణలో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గోన్నారు. వీరి సమక్షంలో మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో మోత్తం 140 కేంద్రల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం అయిందని, కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించిన కాలంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి మరువలేనిదని వారి సేవలను కోనియాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతు తొలి టీకా వేసుకున్న వారందరు రెండో డోసు కూడా తప్పనిసరిగా వేసుకోవాలని అప్పుడే యాంటి బాడీస్ తయారవుతాయని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్ లోనే జరుగుతుందని ఈ వ్యాక్సినేషన్ లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కాలావని కిసన్ రెడ్డి కోరారు.