iDreamPost
android-app
ios-app

షూటింగులకు షాక్ ఇచ్చిన పుష్ప

  • Published Dec 03, 2020 | 12:58 PM Updated Updated Dec 03, 2020 | 12:58 PM
షూటింగులకు షాక్ ఇచ్చిన పుష్ప

అంతా సద్దుమణుగుతోంది, షూటింగులు ఎప్పటిలాగే నిర్విరామంగా సాగుతాయనుకుంటున్న తరుణంలో పుష్ప షూటింగ్ లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తొలుత ఒకరికే వచ్చిందన్న టాక్ ఉన్నప్పటికీ ఆ సంఖ్య పదికి పైగా ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్. అందులో ఎవరికో సీరియస్ గా ఉందని కూడా అంటున్నారు. అధికారికంగా యూనిట్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేదు కానీ ప్రచారమైతే చాలా వేడిగా సాగుతోంది. అల్లు అర్జున్ ఈ కారణంగానే హైదరాబాద్ వచ్చేశాడు. క్వారెంటైన్ లో ఉంటాడా లేక నీహారిక పెళ్లికి హాజరవుతాడా అనేది వేచి చూడాలి.

ఇప్పుడీ పరిణామం అందరినీ ఖంగారు పెడుతోంది. లాక్ డౌన్ కు ముందు ఆగిపోయిన సినిమాల షూటింగ్స్ అన్నీ మళ్ళీ రీ స్టార్ట్ అయ్యాయి. ఆచార్యలో చిరంజీవి అడుగుపెట్టడం తప్ప దాదాపు అందరూ సెట్స్ మీద ఉన్నారు. ఇప్పుడీ షాక్ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పుష్ప షూట్ జరుగుతున్న మారేడుమిల్లి ప్రాంతంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే సుకుమార్ చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే సహజమైన అటవి వాతావరణంలో యూనిట్ సభ్యులు ఎక్కువగా ఉండటంతో ఏదో ఒక రూపంలో కరోనా ఎటాక్ అయినట్టు కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఇప్పటికే పుష్ప చాలా ఆలస్యమయ్యింది. ఒకవేళ తిరిగి మొదలుపెట్టడానికి ఇంకా ఆలస్యమైతే వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడం అసాధ్యం. అదే జరిగితే మళ్ళీ దసరాకో లేదా దీపావళికో వెళ్లాల్సి ఉంటుంది. అదీ కుదరకపోతే 2022 సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఈ సంవత్సరం పండక్కు బ్లాక్ బస్టర్లు సాధించిన మహేష్, బన్నీ ఇద్దరూ తమ కొత్త సినిమాల విషయంలో సాగుతూ ఆగుతూ ఉండటం కాకతాళీయం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్పకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. విజయ్ సేతుపతి తప్పుకున్నాక ఆ క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకున్నారో ఇంకా వెల్లడించలేదు.