iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం

కరోనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాలేదని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాకినాడలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కలకలం మొదలైంది.

హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి ఇటీవలే దక్షిణ కొరియా వెళ్ళొచ్చాడని, స్వగ్రామానికి చేరుకున్న ఆ వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి బ్లడ్ శాంపిల్స్ ను గాంధీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే కేబినెట్ సమావేశంలో కరోనాను ఎదుర్కోవడం గురించి ప్రత్యేక చర్చలు జరుగుతాయని సమాచారం.

తెలంగాణలో కరోనా లక్షణాలున్న వ్యక్తి ఇంటి చుట్టూ యాంటీ వైరస్ ను పిచికారీ చేసారు. మహేంద్ర హిల్స్ ప్రాంతపు వ్యక్తికి వైరస్ సోకడంతో అక్కడి వీధులన్నీ శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.. కాగా వైరస్ భయంతో మహేంద్ర హిల్స్ ప్రాంతంలో పాఠశాలలకు
పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కరోనాని ఎదుర్కోవడానికి తెలంగాణ మంత్రులు సబ్ కేబినెట్ భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే..

కాగా రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ కు సంబంధించి రెండు హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించారు. ఏవిధమైన అనుమానాలు ఉన్నా ఈ నంబర్లకు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు,లేదా సమాచారం అందించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం 0866-2410978 ను ప్రారంభించగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 040-24651119 నంబర్ ను ప్రారంభించారు.