iDreamPost
android-app
ios-app

రామ జన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా

రామ జన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా

రామ జన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రికి తరలించి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నృత్యగోపాల్‌దాస్‌కు కరోనా నిర్దారణ అయింది.

అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో భాగంగా మోదీతోపాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌ వేదిక పంచుకున్నారు.కాగా ప్రస్తుతం నృత్యగోపాల్ దాస్ కి కరోనా నిర్దారణ కావడంతో పలువురిలో ఆందోళన మొదలైంది. ఆయన ప్రస్తుతం మథురలో ఉన్నారు. ఇప్పటికే రామ మందిర పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 5 న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తరువాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. అయోధ్యలో రామ్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రామ జన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా వైరస్‌ సోకడంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు.