iDreamPost
android-app
ios-app

కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

కరోనా దేశంలో ఉధృతంగా వ్యాపిస్తుంది. పలువురు ప్రముఖులకు, క్రీడాకారులకు,రాజకీయ నాయకులకు కూడా కరోన మహమ్మారి సోకుతుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు.

తాజాగా వ్య‌వ‌సాయ శాఖ స‌హాయ మంత్రి కైలాశ్ చౌద‌రికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది.ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. త‌న‌‌కు కరోనా వైర‌స్ సోకిన‌ట్టు కేంద్రమంత్రి కైలాష్ చౌదరి శ‌నివారం ట్విట్ట‌ర్ వేదికగా వెల్ల‌డించారు.

తనకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందని, భ‌య‌ప‌డాల్సిన విష‌యం ఏమీ లేదని ఆయన తెలిపారు. రాజ‌స్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఒక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.. తనతో కాంటాక్ట్‌లో ఉన్న‌వారిని కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోమని విజ్ఞప్తి చేసారు.