Idream media
Idream media
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తిరుపతిలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓవైపు విజయవాడ పున్నమి ఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కుల మతాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ జనసేన పార్టీకే చెందిన క్రైస్తవుల సంఘం నేత అలివర్ రాయ్ కేసు పెట్టారు.
మరోవైపు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ల ఫోరం సభ్యులు పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని క్రిస్టియన్ నేతలు పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫోరం తప్పుబట్టింది.