iDreamPost
iDreamPost
తెరమీద ఒకప్పుడు సక్సెస్ ఫుల్ కాంబినేషన్లుగా ప్రూవ్ అయిన హీరో హీరోయిన్లు ఆ తర్వాత అంతే స్థాయిలో కొనసాగడం ఉండదు. హీరోల సంగతేమో కానీ హీరోయిన్లు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు గానో లేదా సీరియల్స్ వైపు షిఫ్ట్ అవ్వడం జరగాలి. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. నిన్నటి తరం జంట కమల్ హాసన్ మీనాలు 25 ఏళ్ళ తర్వాత తెరమీద కలిసి దర్శనమివ్వబోతున్నారు. అది కూడా జంటగా భార్యాభర్తలుగా. వీళ్లిద్దరు కలిసి చివరిసారి కనిపించిన సినిమా 1996లో వచ్చిన భామనే సత్యభామనే. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెలుగు వెర్షన్ ని ఎస్ పి బాలసుబ్రమణ్యం నిర్మాతగా వ్యవహరించి అందించారు.
ఆ తర్వాత మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. మలయాళం తెలుగు లో బ్లాక్ బస్టర్ దృశ్యంని కమల్ తమిళంలో పాపనాశం పేరుతో రీమేక్ చేసి అక్కడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మరోసారి ఈ టాపిక్ తెరమీదకు వచ్చింది. అయితే ఫస్ట్ పార్ట్ లో నటించిన గౌతమితో కమల్ తెగతెంపులు చేసుకున్న కారణంగా మళ్ళీ రిపీట్ చేసే ఛాన్స్ లేదు. అందుకే బాగా అలోచించి రెండు భాషల్లో మోహన్ లాల్, వెంకటేష్ సరసన చేసి పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్న మీనానే తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా చెన్నై టాక్. విక్రమ్ కన్నా ముందు కమల్ పాపనాశం 2ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇంకా అఫీషియల్ అప్ డేట్ రాలేదు. ఓటిటిలో రిలీజైన మలయాళం దృశ్యం 2 సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తెలుగు రీమేక్ ఇప్పటికే వెంకీ పూర్తి చేసి ఎఫ్3 కోసం రెడీ అవుతున్నారు. లేట్ అయ్యింది కమలే. కేవలం నెలన్నర వ్యవధిలో వేగంగా పూర్తి చేసి సాధ్యమైతే థియేటర్లు లేదా డిజిటల్ దారిలో పాపనాశం 2ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. జీతూ జోసెఫే డైరెక్షన్ చేయబోతున్నారు. హిందీలోనూ అజయ్ దేవగన్ తో కొనసాగింపు ప్రయత్నాల్లో నిర్మాతలు ఉన్నారు. జపాన్, చైనాలకు కూడా దృశ్యం 2 రీమేక్ వెళ్లబోతోంది. మొత్తానికి ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన దృశ్యంకు మూడో భాగం వచ్చినా ఆశ్చర్యం లేదు