iDreamPost
android-app
ios-app

కడప గడపలో అభివృద్ధి పరుగులు

కడప గడపలో అభివృద్ధి పరుగులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్‌కడపలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. జిల్లా అభివృద్ధిపై స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డే ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే జిల్లాలో దాదాపు వెయి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయడం విశేషం. జిల్లా కేంద్రం కడప, బద్వేలు నియోజకవర్గంలో.. వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు.

బద్వేలు నియోజకవర్గంలో..

బద్వేలు నియోజకవర్గంలో రోడ్లు, స్మశాన వాటికలు, నీటిపారుదల తదితర పనులు 500 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. బద్వేలు పట్టణంలో సీసీ రోడ్డు, పార్కుల సుందరీకరణ, స్మశాన వాటికల అభివృద్ధి, మార్కెట్ల అభివృద్ధి వంటి పనులు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. బ్రహ్మసాగర్‌లో సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు చేసేందుకు, దిగువ సగిలేరు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు చేసేందుకు 79.37 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. 35.90 కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్‌ ఎడమ కాలువలో మూడు లిఫ్టులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

కడప నగరంలో..

కడప నగరాన్ని ప్రముఖ నగరాల సరసన నిలబెట్టేలా తీర్చిదిద్దుతామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అందుకు తగినట్లుగానే తన ప్రభుత్వ హాయంలో నగరంలో నిరంతరం అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. వైఎస్సార్‌ మరణం తర్వాత కడప జిల్లాను పాలకులు పట్టించుకోలేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. దాదాపు 459 కోట్ల రూపాలతో కూడిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. కడపలో నిర్మించిన వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ప్లడ్‌ లైట్ల ఏర్పాటు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. నగరంలో 8, ఆరు వరుసల రోడ్ల నిర్మాణానికి, రోడ్ల కూడళ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వరదల సమయంలో కడప వాసులను ఇబ్బంది పెడుతున్న బుగ్గవంక వాగు సమస్య పరిష్కారం కోసం.. రక్షణ గోడ, ఐదు చోట్ల హైలెవల్‌ బ్రిడ్జీల నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎంత చేసినా జిల్లా రుణం తీర్చుకోలేదని జగన్‌ వ్యాఖ్యనించారు.

Also Read : జగన్‌ క్లాస్‌ తర్వాతైనా ప్రతిపక్షాలకు అర్థమవుతుందా..?