iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి జగన్ ఇంట తీవ్ర విషాదం

ముఖ్యమంత్రి జగన్ ఇంట తీవ్ర విషాదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామగారైన ప్రముఖ వైద్యుడు,ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన జగన్ భార్య అయిన వైఎస్ భారతికి తండ్రి అన్న సంగతి తెలిసిందే.

చిన గంగిరెడ్డి పులివెందుల పట్టణంలో మంచి వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.  

గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గంగిరెడ్డి మరణంలో సీఎం జగన్ నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.