iDreamPost
android-app
ios-app

శాసన మండలికి గోరేటి వెంకన్న

శాసన మండలికి గోరేటి వెంకన్న

ప్రముఖ కవి, జానపద కళాకారుడు, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నను తెలంగాణ సీఎం కేసీఆర్‌ శాసన మండలి సభ్యునిగా ఎంపిక చేశారు. గవర్నర్‌ కోటాలో గోరేటి వెంకన్నను శాసన మండలికి పంపించాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో గోరేటి వెంకన్న తన గళాన్ని వినిపించారు. తెలంగాణ యాస, భాషలతో పాటలు పాడుతూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ఈ నేపథ్యంలోనే గోరేటి వెంకన్నను శాసన మండలికి పంపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల భర్తీ పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Giriş