iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి జగన్ నివాసాల భద్రతకు కేటాయించిన జీవోలు రద్దు.

  • Published Dec 07, 2019 | 9:24 AM Updated Updated Dec 07, 2019 | 9:24 AM
ముఖ్యమంత్రి జగన్ నివాసాల భద్రతకు కేటాయించిన జీవోలు రద్దు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి సంబంధించిన  తాడేపల్లి , హైదరాబాద్ నివాసాల భద్రతకు కేటాయించిన జీవోలు రద్దు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆరు జీవోలను విడుదల చేసింది. తాడేపల్లిలోని సి.యం క్యాంప్ ఆఫీసుకు ఎలక్ట్రిక్ మేయింటేనెన్స్ కి, ముఖ్యమంత్రి హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ భద్రతకు, మరికోన్ని భద్రత అంశాలకు సంభందించి గతంలో ప్రభుత్వం 139, 160, 254, 259, 307, 308 జి.ఒలు విడుదల చేసింది. వీటి మొత్తం విలువ 2కోట్ల 98.5లక్షలు, అయితే జగన్ ప్రభుత్వం మొదటి నుండి చెబుతున్నట్టు పాలనలో సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గిస్తూ అవసరం మేరకు నిధులు ఉపయోగించాలని చెప్పుకుంటు వస్తున్న జగన్ ప్రభుత్వం తన భద్రతకు సంభందించిన జీవో`ల పై పునసమీక్షించి, ప్రోటోకాల్ ప్రకారం నియమించిన భద్రత కోసం ఇచ్చిన జీవో సైతం రద్దు చేశారు.

రాష్ట్రం ఆర్ధికంగా లోటులో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు 3 క్యాంప్ కార్యాలయాలకు 45కోట్లు, 15కోట్లు చార్టెడ్ ఫ్లైట్లు అంటూ వివిద రూపాలలో చేసిన సుమారు 99కోట్ల ఖర్చులపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు ఒక పరంగా చంద్రబాబుకు ఇబ్బందే కలిగించాయి, అయితే ముఖ్యమంత్రి జగన్ సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పాలనలో ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, ఈ సమయంలోనే నిబంధనలమేరకు కోన్ని భద్రతా అంశాలు తప్పనిసరైనప్పటికి పునసమీక్షించి వాటిని కూడా రద్దు చేస్తూ తన పాలనలో దుబారాను ప్రోత్సహించను అని మరోసారి రుజువుచేశారనే చెప్పలి.