iDreamPost
android-app
ios-app

వెలిగొండ పూర్తి పై సీఎం జగన్ ప్రకటన

వెలిగొండ పూర్తి పై సీఎం జగన్ ప్రకటన

దాదాపు 25 ఏళ్లుగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రాంత ప్రజలకు కలగానే మిగిలిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై సీఎం జగన్‌ కృతనిశ్చంతో ఉన్నారు. ఈ రోజు గురువారం సీఎం జగన్‌ ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇకపై చేయాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెన్నెల్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు ఫొటో గ్యాలెరీని తిలకించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Read Also : మూడు దశాబ్ధాల కల వెలిగొండ …సాకారం దిశగా జగన్ సమీక్ష

ఇప్పటి వరకు వెలిగొండ ప్రాజెక్టుకు 5,107 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తికి ఇంకా 3,480 కోట్లు అవసరమవుతాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 15 నాటికి వెలిగొండ మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆ పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందివ్వనున్న విషయం తెలిసిందే.